PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/thadipatri-jc-prabakar-reddy-ex-mla-peeddi-reddy8b3483f6-aafd-4ebb-bcc9-8768580ccc9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/thadipatri-jc-prabakar-reddy-ex-mla-peeddi-reddy8b3483f6-aafd-4ebb-bcc9-8768580ccc9e-415x250-IndiaHerald.jpgగత ఐదేళ్లలో వైసీపీ పార్టీ హయాంలో పాటుగా ఎన్నికల సమయంలో తమ పైన తమ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టారంటూ గత కొద్దిరోజులుగా మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి పలు రకాల ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు.. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతున్న నేరుగా ఆయనే రంగంలోకి దిగడం జరిగింది.. ఈ మేరకు 150 వాహనాల కాన్వయ్ ను ఏర్పాటు చేసుకొని మరి బయలుదేరి వెళ్లినట్లుగా తెలుస్తోంది. నిన్నటి రోజున తన అనుచరులతో తాడిపత్రి నుంచి అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు బయలుదేరTHADIPATRI;JC PRABAKAR REDDY;EX MLA PEEDDI REDDY{#}prabhakar;prabhakar reddy;Ananthapuram;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Traffic police;police;TDP;News;MLA;Assembly;YCP;Governmentరాయలసీమ: పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!రాయలసీమ: పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!THADIPATRI;JC PRABAKAR REDDY;EX MLA PEEDDI REDDY{#}prabhakar;prabhakar reddy;Ananthapuram;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;Traffic police;police;TDP;News;MLA;Assembly;YCP;GovernmentThu, 25 Jul 2024 06:29:00 GMTగత ఐదేళ్లలో వైసీపీ పార్టీ హయాంలో పాటుగా ఎన్నికల సమయంలో తమ పైన తమ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టారంటూ గత కొద్దిరోజులుగా మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి పలు రకాల ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు.. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతున్న నేరుగా ఆయనే రంగంలోకి దిగడం జరిగింది.. ఈ మేరకు 150 వాహనాల కాన్వయ్ ను ఏర్పాటు చేసుకొని మరి బయలుదేరి వెళ్లినట్లుగా తెలుస్తోంది. నిన్నటి రోజున తన అనుచరులతో తాడిపత్రి నుంచి అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు బయలుదేరి వెళ్లినట్లుగా తెలుస్తోంది.


వాస్తవానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోలింగ్ రోజున తాడిపత్రిలో రాళ్ల దాడులు కూడా ఎక్కువగా జరిగాయి. ఈ సమయంలో పోలీసులు వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారని కూడా వార్తలు వినిపించాయి. అలాగే కొంతమంది పైన తప్పుడు కేసులు పెట్టారని దీంతో చాలామంది టీడీపీ కార్యకర్తలు జైలుకు వెళ్లారని జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఆరోజు వైసిపి నేతలు చెప్పినట్టుగానే పోలీసులు సైతం వ్యవహరించారని కూడా తెలిపారు. తాజాగా అనంతపురం పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి..


పోలింగ్ రోజున తాడిపత్రిలో జరిగినటువంటి రాళ్లదాడికి తనతో పాటు తమ టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని ఎందుకు కేసులు పెట్టారు చెప్పాలి అంటూ పోలీసులను సైతం డిమాండ్ చేయడం జరిగింది. తమ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయో అంటూ నిలదీశారు జెసి ప్రభాకర్ రెడ్డి. దీంతో పోలీసులకు చాలా ఇబ్బందులు ఎదురైనట్లుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన ఈ కేసులను సైతం ఉపసంహరించుకోవాలి అంటూ డిమాండ్ చేస్తూ అనంతపురం ఎస్పీని సైతం ప్రభాకర్ రెడ్డి కలిశారు. అలాగే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి మేరకే ఇలాంటి కేసులు పెట్టారని అందుకే ఈ కేసులను ఎత్తివేయాలని లేనిపక్షంలో తమ సత్తా చూపిస్తామంటూ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు తెలియజేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>