MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun5d119d72-245f-40c4-96a5-4dcac084b42d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun5d119d72-245f-40c4-96a5-4dcac084b42d-415x250-IndiaHerald.jpgఅల్లు వారసుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పరిచయం అక్కర్లేదు. వచ్చింది మెగా ఫ్యామిలీ నుండైనా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుని, చాలా బలమైన ఆర్మీని సంపాదించుకున్నాడు మన బన్నీ. చేసిన రెండో సినిమాతోనే మా సినిమా హీరోల సరసన చేరి... నేడు అగ్ర నాయకుల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. ఆ రెండో సినిమా అని డైరెక్ట్ చేసింది సుకుమార్ అని వేరే చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఏదో తెలియని బంధం పెనవేసుకుంది. ఈ క్రమంలోనే ఆర్య 2, పుష్ప సినిమాలు వచ్చాయి. ఇక పుష్ప సినిమా ఎటువంటి ప్రభంజనం సృష్టించallu arjun{#}arya;Allu Arha;Allu Sneha;Aryaa;Norway;sukumar;Allu Arjun;Cinemaసెల్ఫీ అదిరిందయ్యా పుష్ప రాజ్!సెల్ఫీ అదిరిందయ్యా పుష్ప రాజ్!allu arjun{#}arya;Allu Arha;Allu Sneha;Aryaa;Norway;sukumar;Allu Arjun;CinemaThu, 25 Jul 2024 16:40:00 GMTఅల్లు వారసుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పరిచయం అక్కర్లేదు. వచ్చింది మెగా ఫ్యామిలీ నుండైనా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుని, చాలా బలమైన ఆర్మీని సంపాదించుకున్నాడు మన బన్నీ. చేసిన రెండో సినిమాతోనే మా సినిమా హీరోల సరసన చేరి... నేడు అగ్ర నాయకుల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. ఆ రెండో సినిమా అని డైరెక్ట్ చేసింది సుకుమార్ అని వేరే చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఏదో తెలియని బంధం పెనవేసుకుంది. ఈ క్రమంలోనే ఆర్య 2, పుష్ప సినిమాలు వచ్చాయి. ఇక పుష్ప సినిమా ఎటువంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వచ్చిన పుష్ప సినిమా కలెక్షన్ల వర్షంతో పాటు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో పుష్ప పార్ట్ 2 తెరకెక్కుతోంది. ఇక దీనిపై అంచనాలు ఏ రకంగా ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఒక పది శాతం షూటింగ్ తప్పితే మొత్తం షూటింగ్ పూర్తయినట్టు విశ్వసినీ వర్గాల సమాచారం. అయితే దానికి కాస్త గ్యాప్ దొరకడంతో బన్నీ సతి సమేతంగా... నార్వే లో హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో వీరు తీసుకున్న సెల్ఫీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

కాసేపటి క్రితం అల్లు అర్జున్ భార్య అల్లూ స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఆ ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటో ప్రత్యేకత ఏమిటంటే... అందులో అల్లు అర్జున్ కనబడక పోవడమే. అయినా ఆ ఫోటో చూపరులను ఆకర్షిస్తుంది. అయితే దానికి కారణం లేకపోలేదు... అల్లు అర్జున్ హగ్ చేసుకున్న స్నేహ రెడ్డి తన ముఖాన్ని కవర్ చేస్తూ, ఆ వెనకవైపు ఉన్న అల్లు అర్హ అల్లరిని క్యాప్చర్ చేసింది. దాంతో ఈ ఫోటో అల్లు అభిమానులకు తెగ నచ్చేస్తోంది... ఈ క్రమంలోనే అదిరిందయ్యా పుష్ప రాజ్! కామెంట్స్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>