MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/svc3ab31a1f-d11d-4006-83fc-675240c368b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/svc3ab31a1f-d11d-4006-83fc-675240c368b6-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో SVC సంస్థ ఒకటి. ఈ సంస్థ వారు ఇప్పటికే ఎన్నో సినిమాలను నైజాం ఏరియాలో విడుదల చేసింది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో పీపుల్స్ మీడియా బ్యానర్ ఒకటి. ఈ బ్యానర్ వారు తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని రూపొందించారు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీsvc{#}cinema theater;Mass;Mister;Ravi;harish shankar;ravi teja;sree;Tollywood;Heroine;media;Cinemaతొలిసారి ఆ సంస్థ మూవీ నైజాం హక్కులను దక్కించుకున్న ఎస్విసి సంస్థ..?తొలిసారి ఆ సంస్థ మూవీ నైజాం హక్కులను దక్కించుకున్న ఎస్విసి సంస్థ..?svc{#}cinema theater;Mass;Mister;Ravi;harish shankar;ravi teja;sree;Tollywood;Heroine;media;CinemaThu, 25 Jul 2024 13:44:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో SVC సంస్థ ఒకటి. ఈ సంస్థ వారు ఇప్పటికే ఎన్నో సినిమాలను నైజాం ఏరియాలో విడుదల చేసింది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో పీపుల్స్ మీడియా బ్యానర్ ఒకటి. ఈ బ్యానర్ వారు తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని రూపొందించారు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన దాదాపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలో థియేటర్ హక్కులను ఈ మూవీ బృందం అమ్మి వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా యొక్క నైజాం హక్కులను భారీ ధరకు SVC సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటి వరకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు అనేక సినిమాలను రూపొందించారు. అందులో ఏ సినిమాను కూడా నైజాం ఏరియాలో SVC సంస్థ విడుదల చేయలేదు.

మొట్ట మొదటి సారి పీపుల్స్ మీడియా సంస్థ వారు నిర్మించిన మిస్టర్ బచ్చన్ మూవీ ని SVC సంస్థ నైజాం ఏరియా లో విడుదల చేయనుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సంస్థ వారు ఈ సినిమాను నైజాం ఏరియాలో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను ఇప్పటి నుండే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలో రవితేజ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో షాక్ , మిరపకాయ్ మూవీ లు రూపొందాయి. అందులో షాక్ మూవీ ఫ్లాప్ కాగా , మిరపకాయ్ మంచి విజయం అందుకుంది. మరి వీరి కాంబోలో రూపొందిన మూడవ సినిమా అయినటువంటి మిస్టర్ బచ్చన్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>