PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/10-kotlaku-brs-mlalanu-kontunna-revanthafb8486b-bb83-41aa-8833-6ed2ba9c31b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/10-kotlaku-brs-mlalanu-kontunna-revanthafb8486b-bb83-41aa-8833-6ed2ba9c31b2-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో పార్టీ నేతలు అందరూ వరుసగా కాంగ్రెస్ లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. గులాబీ పార్టీ టికెట్ ద్వారా గెలిచి చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దాదాపు 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇంకా మరి కొంతమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చేరికలపై తాజాగా... వివాదాస్పద ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. brs{#}Komatireddy Rajgopal Reddy;prasanth;Prashant Kishor;Telangana;media;News;Congress;Reddy;MLA;Partyబీఆర్ఎస్ ఎమ్మెల్యేల రేటు 10 కోట్లు?బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రేటు 10 కోట్లు?brs{#}Komatireddy Rajgopal Reddy;prasanth;Prashant Kishor;Telangana;media;News;Congress;Reddy;MLA;PartyThu, 25 Jul 2024 08:32:12 GMTతెలంగాణ రాష్ట్రంలో పార్టీ నేతలు అందరూ వరుసగా కాంగ్రెస్ లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. గులాబీ పార్టీ టికెట్ ద్వారా గెలిచి చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దాదాపు 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇంకా మరి కొంతమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చేరికలపై తాజాగా... వివాదాస్పద ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


నోరు తెరిస్తే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... గులాబీ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు పై.. సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు. గులాబీ పార్టీ శాసనసభ్యులను ఐదు నుంచి పది కోట్ల వరకు కొనుగోలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మీడియా చిట్ చాట్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు... 20 కోట్లకు పైగా డబ్బులు ఇచ్చి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆయన తెలిపారు.


మంత్రి పదవి కోసం తాను ఎలాంటి పైరవీ చేయటం లేదని.. నేను భైరవి చేస్తే ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానని బాంబు పెంచారు. బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలను... ఐదు నుంచి పది కోట్లకు కొనుగోలు చేస్తున్నామని... ఇంకా చాలామంది తమ పార్టీలో చేరుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.


మా దగ్గరకు 26 మంది ఎమ్మెల్యేలు ఇంకా రాలేదని... వాళ్లందరూ త్వరగానే వస్తారని తెలిపారు. అప్పుడు గులాబీ పార్టీ  LP విలీనం ఉంటుందని వివరించారు. కానీ ప్రశాంత్ రెడ్డి ఇలాంటి నేతలను కొనుగోలు చేయలేమని... మిగతా నేతలను కొనుగోలు చేస్తామని రాజగోపాల్ రెడ్డి తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>