PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-jagan-mohan-reddy-ysrcp-ycp-ys-jaganb8b4d2c8-718a-434f-9d1b-ba139e22a9fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-jagan-mohan-reddy-ysrcp-ycp-ys-jaganb8b4d2c8-718a-434f-9d1b-ba139e22a9fe-415x250-IndiaHerald.jpg- జ‌గ‌న్ ఢిల్లీ దీక్ష‌కు స‌మాజ్ వాద్ పార్టీ .. ఉద్ద‌వ్ థాక‌రే శివ‌సేన స‌పోర్ట్ - జ‌గ‌న్ సింప‌తీ గేమ్ అంటూ కొట్టి పారేస్తోన్న కూట‌మి పార్టీలు . . ! - సాధార‌ణ ప్ర‌జ‌ల్లో నూ సింప‌తీ గేమ్ అన్న అభిప్రాయ‌మే..! ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . ఏపీలో వైసిపి కార్యకర్తలపై దాడులు జరుగుతున్న క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీ వేదికగా నిరసన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు అయిందో లేదో జగన్ ఢిల్లీ వేదికగా చేపట్టిన ఈ దీక్ys jagan; jagan mohan reddy; ysrcp; ycp; ys jagan{#}shiv sena party;Akhilesh Yadav;GEUM;Delhi;MP;Jagan;Government;media;Telangana Chief Minister;Reddy;Amaravathi;YCP;India;Andhra Pradesh;Partyన‌న్ను చంపేయండి... జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...?న‌న్ను చంపేయండి... జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...?ys jagan; jagan mohan reddy; ysrcp; ycp; ys jagan{#}shiv sena party;Akhilesh Yadav;GEUM;Delhi;MP;Jagan;Government;media;Telangana Chief Minister;Reddy;Amaravathi;YCP;India;Andhra Pradesh;PartyThu, 25 Jul 2024 10:17:53 GMT- జ‌గ‌న్ ఢిల్లీ దీక్ష‌కు స‌మాజ్ వాద్ పార్టీ .. ఉద్ద‌వ్ థాక‌రే శివ‌సేన స‌పోర్ట్
- జ‌గ‌న్ సింప‌తీ గేమ్ అంటూ కొట్టి పారేస్తోన్న కూట‌మి పార్టీలు . . !
- సాధార‌ణ ప్ర‌జ‌ల్లో నూ సింప‌తీ గేమ్ అన్న అభిప్రాయ‌మే..!

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) .

ఏపీలో వైసిపి కార్యకర్తలపై దాడులు జరుగుతున్న క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీ వేదికగా నిరసన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు అయిందో లేదో జగన్ ఢిల్లీ వేదికగా చేపట్టిన ఈ దీక్ష విషయంలో ఇండియా కూటమిలోని కీలక పార్టీగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతు ఇవ్వడంతో చర్చనీయాంశంగా మారింది. అలాగే ఉద్ద‌వ్ థాక‌రే శివ‌సేన‌ వర్గానికి చెందిన కొందరు ఎంపీలు కూడా ఈ దీక్షకు మద్దతు పలికారు. ఇక ఢిల్లీలో ఉన్న జగన్ ఓ ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో వైసిపి కార్యకర్తలపై దాడులు జరుగుతున్న క్రమాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.


తనను చంపాలనుకుంటే చంపేయండి అని జగన్ అన్నారు .. అంతేగాని మీకు ఓటు వేయలేదని కారణంతో అమాయకులైన ప్రజలు .. కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి దాడులు చేయటం సరికాదని జగన్ అన్నారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సహజంగానే చర్చ‌కి వస్తున్నాయి. జగన్ కేవలం నెల రోజులకే ప్రభుత్వంపై ఎంత హడావుడి చేయటం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం జగన్ సానుభూతి ... సంపతి కోసమే ఇలాంటి డ్రామాలు ప్లే చేస్తున్నారన్న చర్చలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని సాధారణ ప్రజలలో కూడా వినిపిస్తున్నాయి. అలాగే కూట‌మి లోని పార్టీ లు సైతం జ‌గ‌న్ సింప‌తీ కోస‌మే ఈ డ్రామా దీక్ష‌లు చేస్తున్నారంటూ మండి ప‌డుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>