PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jr-ntr-minister-sathyakumr-yadau-bjpe39d93ad-5e22-4a5d-8a55-6d7bd4fc596a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jr-ntr-minister-sathyakumr-yadau-bjpe39d93ad-5e22-4a5d-8a55-6d7bd4fc596a-415x250-IndiaHerald.jpgఏపీ అసెంబ్లీలో పరోక్షంగా ఎన్టీఆర్ గురించి బిజెపి నేత సత్య కుమార్ యాదవ్ మాట్లాడడం జరిగింది.. ముఖ్యంగా ఎన్టీఆర్ పేరుతో ఉన్న విశ్వవిద్యాలయం పేరుని మారుస్తున్నప్పుడు అటు నందమూరి కుటుంబ సభ్యులు కానీ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి గాని ఈ విషయాన్ని ఏ మాత్రం ఖండించలేదు అంటూ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు అసెంబ్లీలో చేశారు. అయితే ఈ విషయాలు చేసినప్పుడు చంద్రబాబు సైతం ఏదో ఆలోచిస్తూ ఉన్నట్లుగా చూపించడం జరిగింది. తిరిగి ఎన్టీఆర్ హెల్త్ విశ్వవిద్యాలయం పేరును పెట్టడం అలాగే వైద్య ఆరోగ్య శాఖJR.NTR;MINISTER SATHYAKUMR YADAU;BJP{#}satya;University;Lakshmi Parvathi;Doctor;students;Father;Jr NTR;NTR;Kumaar;Wife;TDP;Bharatiya Janata Party;CBN;Reddy;YCP;Ministerఏపీ బీజేపీ: మంత్రి గారి విమర్శలు జూనియర్ ఎన్టీఆర్ పైనేనా..?ఏపీ బీజేపీ: మంత్రి గారి విమర్శలు జూనియర్ ఎన్టీఆర్ పైనేనా..?JR.NTR;MINISTER SATHYAKUMR YADAU;BJP{#}satya;University;Lakshmi Parvathi;Doctor;students;Father;Jr NTR;NTR;Kumaar;Wife;TDP;Bharatiya Janata Party;CBN;Reddy;YCP;MinisterThu, 25 Jul 2024 10:31:00 GMTఏపీ అసెంబ్లీలో పరోక్షంగా ఎన్టీఆర్ గురించి బిజెపి నేత సత్య కుమార్ యాదవ్ మాట్లాడడం జరిగింది.. ముఖ్యంగా ఎన్టీఆర్ పేరుతో ఉన్న విశ్వవిద్యాలయం పేరుని మారుస్తున్నప్పుడు అటు నందమూరి కుటుంబ సభ్యులు కానీ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి గాని ఈ విషయాన్ని ఏ మాత్రం ఖండించలేదు అంటూ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు అసెంబ్లీలో చేశారు. అయితే ఈ విషయాలు చేసినప్పుడు చంద్రబాబు సైతం ఏదో ఆలోచిస్తూ ఉన్నట్లుగా చూపించడం జరిగింది. తిరిగి ఎన్టీఆర్ హెల్త్ విశ్వవిద్యాలయం పేరును పెట్టడం అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తనకు చాలా ఆనందంగా ఉందంటూ ఈ బిల్లు ప్రవేశపెట్టారు.



చాలా మంది ఎదగడానికి ఎన్టీఆర్ పేరును వాడుకొని ఆయన పేరు మారుస్తూ ఉంటే కనీసం నిరసనలు కూడా చెప్పడం లేదని సత్య కుమార్ యాదవ్ అసెంబ్లీలో ప్రసంగించారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తున్నప్పుడు సొంత కుటుంబీకుల నిరసన తెలియలేదని చెప్పినప్పుడు దీంతో టీడీపీ సభ్యులు కూడా కాస్త ఇబ్బంది పడ్డట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ మీద కుటుంబ సభ్యులకు ఎలాంటి గౌరవం లేదంటూ కూడా ఫైర్ అయ్యారు మినిస్టర్ సత్యకుమార్.



అలాగే ఆ మహనీయుడు పేరు చెప్పుకొని పబ్బం గడుపుతున్న వ్యక్తులు ఆ మహనీయుడు పేరు మార్చినప్పుడు కనీసం స్పందించలేదంటూ అటు ఇన్ డైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని అనడమే.. కాకుండా వైసిపి లో ఉన్న  లక్ష్మీపార్వతి పైన కూడా ఇండైరెక్టుగానే సెటైర్ వేసినట్లుగా కనిపిస్తోంది వైద్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్. డాక్టర్ వైయస్సార్ గారే ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ యూనివర్సిటీ అని పేరు పెట్టారని తెలియజేశారు. తన తండ్రి పెట్టిన పేరుని అతని కుమారుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసివేశారని తెలియజేశారు. ఈ పేరు మార్పు వల్ల విద్యార్థులు అడ్మిషన్లతో చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా తెలియజేశారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ని అన్నారా లేదా అనే విషయం పైన మంత్రి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>