MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda19ad1cf-2aab-4ac2-8f00-d1a09e7584ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda19ad1cf-2aab-4ac2-8f00-d1a09e7584ce-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. ఇక ఈ సినిమాలో అందాల తార జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతోనే జాన్వి కపూర్ టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా ఇటీవల ఆస్పత్రిలో చేరి డిశ్చార్జ్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె దీని గురించి మాట్లాడుతూ.. ఎంతో ఇబ్బందిపడినట్లు చెప్పారు. పని కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో వరుస షూటింగ్‌లు, ప్రమోషన్స్‌తో బిజీగా tollywood{#}NTR;Janhvi Kapoor;Shiva;anirudh ravichander;bhavana;tara;Chennai;lord siva;Audio;Manam;september;Cinemaనాకు అలాంటి జబ్బు వచ్చిందేమో అని భయపడ్డా.. జాన్వికపూర్..!?నాకు అలాంటి జబ్బు వచ్చిందేమో అని భయపడ్డా.. జాన్వికపూర్..!?tollywood{#}NTR;Janhvi Kapoor;Shiva;anirudh ravichander;bhavana;tara;Chennai;lord siva;Audio;Manam;september;CinemaWed, 24 Jul 2024 16:48:04 GMTజూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. ఇక ఈ సినిమాలో అందాల తార జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతోనే జాన్వి కపూర్ టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌   ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా ఇటీవల ఆస్పత్రిలో చేరి డిశ్చార్జ్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె దీని గురించి మాట్లాడుతూ.. ఎంతో ఇబ్బందిపడినట్లు చెప్పారు. పని కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో వరుస షూటింగ్‌లు, ప్రమోషన్స్‌తో బిజీగా

ఉన్నాను. విరామం లేకుండా వరుస ప్రయాణాలు చేశాను. షూటింగ్‌లలో పాల్గొన్నాను. దీంతో వీక్‌ అయ్యాను. ఓ పాట షూటింగ్‌లో పాల్గొనడం కోసం చెన్నై వెళ్లా. అక్కడ చాలాసార్లు బయట తిన్నాను. మొదట కడుపులో నొప్పిగా అనిపించింది. ఆ తర్వాత పూర్తిగా నీరసించిపోయా. భరించలేనంత నొప్పి, వణుకు వచ్చాయి. టెన్షన్‌ పడ్డాను. హైదరాబాద్‌కు వచ్చేందుకు ఫ్లైట్‌ ఎక్కేముందు పక్షవాతానికి గురయ్యానా అనే భావన కలిగింది. సాయం లేకుండా వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేకపోయాను. నడవడానికి కూడా ఓపిక లేదనిపించింది.

ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. మూడు రోజులు అక్కడ చికిత్స తీసుకున్నాను. మనం అన్నిటికంటే ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని అర్థం చేసుకున్నా. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు మళ్లీ డ్యాన్స్‌ చేయగలనో, లేదో అని భయపడ్డా. ఇప్పుడు మళ్లీ వర్క్‌లో బిజీ అవుతున్నాను. ఇప్పటికీ పూర్తి ఓపిక రాలేదు’ అని చెప్పారు. సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 పట్ల అభిమానులు ఎంత ఆత్రంగా ఉన్నారో చూస్తున్నాం. ఇప్పటికే ఫియర్ సాంగ్ ఊహించిన దానికన్నా పెద్ద ఛార్ట్ బస్టర్ అయ్యింది. అనిరుధ్ రవిచందర్ మిగిలిన పాటలనూ అంతకు మించిన స్థాయిలో ఇచ్చి ఉంటాడని మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. నిజానికి రెండో లిరికల్ ఆడియో ప్రకటన ఈపాటికి వచ్చి ఉండాలి. కానీ ఇంకా పని పూర్తవ్వని కారణంగా అనౌన్స్ మెంట్ పెండింగ్ లో ఉంచారట.  







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>