Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/hero-gopichand-oxygen-telugu-movie-stills-08b41e8a-d90f-4f24-8ea9-234a7048a35f415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/hero-gopichand-oxygen-telugu-movie-stills-08b41e8a-d90f-4f24-8ea9-234a7048a35f415x250-IndiaHerald.jpgమ్యాచో స్టార్ గోపీచంద్ కి ఇప్పుడు అర్జెంట్ గా హిట్ పడాలి. ఒకప్పుడు మాస్ హీరోగా తన మార్క్ హిట్ సినిమాలను అందించిన గోపీచంద్ ఎందుకో ఈమధ్య ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలమవుతున్నాడు. గోపీచంద్ చివరి సినిమా భీమా కూడా ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రాగా అది జస్ట్ ఓకే అనిపించుకుంది. ఐతే కమర్షియల్ సక్సెస్ కాలేదు కానీ గోపీచంద్ ఎఫర్ట్ కి పర్వాలేదుGopichand {#}srinu vytla;sundeep kishan;Mass;Audience;Success;Director;Comedy;Cinemaసూపర్ హిట్ డైరెక్టర్ తో గోపీచంద్..!సూపర్ హిట్ డైరెక్టర్ తో గోపీచంద్..!Gopichand {#}srinu vytla;sundeep kishan;Mass;Audience;Success;Director;Comedy;CinemaWed, 24 Jul 2024 21:54:00 GMTమ్యాచో స్టార్ గోపీచంద్ కి ఇప్పుడు అర్జెంట్ గా హిట్ పడాలి. ఒకప్పుడు మాస్ హీరో గా తన మార్క్ హిట్ సినిమాలను అందించిన గోపీచంద్ ఎందుకో ఈమధ్య ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలమవుతున్నాడు. గోపీచంద్ చివరి సినిమా భీమా కూడా ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రాగా అది జస్ట్ ఓకే అనిపించుకుంది. ఐతే కమర్షియల్ సక్సెస్ కాలేదు కానీ గోపీచంద్ ఎఫర్ట్ కి పర్వాలేదు అనిపించుకుంది. ఐతే ఆ సినిమా తర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్ లో విశ్వం సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమాతో మళ్లీ తిరిగి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.

ఇదిలా ఉంటే గోపీచంద్ విశ్వం తర్వాత నెక్స్ట్ సినిమా కూడా లాక్ అయినట్టు తెలుస్తుంది. గోపీచంద్ హీరోగా ధమాకా డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాను త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ను భగవాన్, పుల్లారావు నిర్మిస్తారని తెలుస్తుంది.

సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా ఇలా కామెడీ ఎంటర్టైనర్ సినిమాలతో వరుస హిట్లు కొడుతున్న నక్కిన త్రినాథ రావు గోపీచంద్ తో తీసే సినిమా కూడా ఇదే పంథాలో ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తినాథ రావు సందీప్ కిషన్ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు మజాకా అని టైటిల్ లాక్ చేశారు. మరి ధమాకా డైరెక్టర్ రాబోతున్న సినిమాలతో ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తాడన్నది చూడాలి. గోపీచంద్ ని కరెక్ట్ గా వాడుకుంటే మంచి మాస్ హిట్ కొట్టే అవకాశం ఉంది. కానీ సరైన సబ్జెక్ట్ పడక అతని ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మరి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కు రాబోతున్న సినిమాలు తిరిగి ఫాం లోకి వచ్చేలా చేస్తాయేమో చూడాలి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>