PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyana84a97db-4d5d-4a1e-a820-b5a5f40ed5b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyana84a97db-4d5d-4a1e-a820-b5a5f40ed5b1-415x250-IndiaHerald.jpg"తప్పు నేను చేసినా కలర్ పట్టుకొని ప్రశ్నించండి!" ఈ మాట అన్నది అచ్చంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అవును, తాజాగా అయన నిండు సభలో ఇచ్చిన స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇపుడు రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. వాస్తవానికి ఈ తరహా ప్రకటనలు అధికారంలో ఉన్న పార్టీల నేతల నుంచి ఆశించలేము. ఎందుకంటే అధికారంలో ఉన్న వారు తాము తప్పు చేసినా చేయలేదనే చెబుతారు. ఒకవేళ చేశారు అని ఇతరులు ఆధారాలు చూపించినా కాదని బుకాయిస్తారు కాబట్టి. రాష్ట్ర రాజకీయాల్లో నేటి వరకు జరిగింది ఇదే. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్pawan kalyan{#}Ayyannapatrudu;advertisement;Telangana Chief Minister;politics;Government;News;CM;kalyan;Andhra Pradesh;Assemblyపవన్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎవరిని ఉద్దేశించి?పవన్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎవరిని ఉద్దేశించి?pawan kalyan{#}Ayyannapatrudu;advertisement;Telangana Chief Minister;politics;Government;News;CM;kalyan;Andhra Pradesh;AssemblyWed, 24 Jul 2024 13:30:00 GMT"తప్పు నేను చేసినా కలర్ పట్టుకొని ప్రశ్నించండి!" ఈ మాట అన్నది అచ్చంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అవును, తాజాగా అయన నిండు సభలో ఇచ్చిన స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇపుడు రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. వాస్తవానికి ఈ తరహా ప్రకటనలు అధికారంలో ఉన్న పార్టీల నేతల నుంచి ఆశించలేము. ఎందుకంటే అధికారంలో ఉన్న వారు తాము తప్పు చేసినా చేయలేదనే చెబుతారు. ఒకవేళ చేశారు అని ఇతరులు ఆధారాలు చూపించినా కాదని బుకాయిస్తారు కాబట్టి. రాష్ట్ర రాజకీయాల్లో నేటి వరకు జరిగింది ఇదే. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్ర రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతోంది.

మరీ ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండీ రాష్ట్ర రాజకీయాలు మారాయనే చెప్పుకోవాలి. ఎవరైనా ఒక అధికారి తమ తప్పులను కప్పిపుచ్చుతుందని ఒక భావనలో ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దానికి భిన్నమైన స్వరాన్ని వినిపించడం చాలా ఆరోగ్యదాయకం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా మాట తూలడం అనేది మచ్చుకైనా కనబడడం లేదు. అదే సమయంలో తనని ఎంతగానో దూషించిన విపక్షాన్ని కూడా పరుషంగా విమర్శించిన దాఖలాలు లేవు. అధికారంలో ఉన్నపుడు బాధ్యతగా ఉండాలని ఆయన తాను తెలుసుకుని ఆచరించి మరీ చూపుతున్నారు.

అదే సమయంలో అయన మాట్లాడుతూ... కొందరు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు మంత్రులను మాయచేసేలా సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. విషయం ఏమిటంటే... తాజాగా కొందరు అధికారులు గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల 3వరోజు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టగా పలువురు శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారుల సరైన సమాచారం ఇవ్వలేదని పవన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సీఎం పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపు విషయంలో అధికారులు ఇచ్చిన సమాచారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>