Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedమహానటి సినిమాలో నటించిన చిన్నప్పటి సావిత్రి గుర్తుందా?.. ఈమె ఆ స్టార్ నటుడి మనవరాలా..? దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ అశ్విని తెరకెక్కించిన చిత్రం మహానటి. 2018లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాదు అవార్డుల పంట పండింది. అదే సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది కీర్తి సురేష్. ఈ సినిమాలో ఆమె నటించింది అనటం కన్నా జీవించింది అని చెప్పుకోవచ్చు. అంతలా సావిత్రమ్మ పాత్రకు ప్రాణం పోసింది కీర్తి సురేష్. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ పథకాలపై ప్రియాంchildhood Savitri ; Mahanati; Mahanati movie; Mahanati movies childhood Savitri updates{#}Susheela;malavika nair;rajendra prasad;savitri;shalini;sai madhav burra;babu rajendra prasad;Savithri;Aswani Dutt;vyjayanthi;naga;Varsham;Chitram;Kanna Lakshminarayana;Mahanati;sandeep;Joseph Vijay;kirti;Tarun Kumar;priyanka;Cinemaమహానటి సినిమాలో నటించిన చిన్నప్పటి సావిత్రి గుర్తుందా?.. ఈమె ఆ స్టార్ నటుడి మనవరాలా..?మహానటి సినిమాలో నటించిన చిన్నప్పటి సావిత్రి గుర్తుందా?.. ఈమె ఆ స్టార్ నటుడి మనవరాలా..?childhood Savitri ; Mahanati; Mahanati movie; Mahanati movies childhood Savitri updates{#}Susheela;malavika nair;rajendra prasad;savitri;shalini;sai madhav burra;babu rajendra prasad;Savithri;Aswani Dutt;vyjayanthi;naga;Varsham;Chitram;Kanna Lakshminarayana;Mahanati;sandeep;Joseph Vijay;kirti;Tarun Kumar;priyanka;CinemaWed, 24 Jul 2024 14:25:00 GMTదివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ అశ్విని తెరకెక్కించిన చిత్రం మహానటి. 2018లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాదు అవార్డుల పంట పండింది. అదే సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది కీర్తి సురేష్. ఈ సినిమాలో ఆమె నటించింది అనటం కన్నా జీవించింది అని చెప్పుకోవచ్చు. అంతలా సావిత్రమ్మ పాత్రకు ప్రాణం పోసింది కీర్తి సురేష్. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ పథకాలపై ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మించారు. సి అశ్వినీ దత్ సమర్పకుడిగా వ్యవహరించారు.


దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషించగా..మోహన్ బాబు, నాగచైతన్య, క్రిష్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగ, సాయి మాధవ్ బుర్రా తదితరులు అతిథి పాత్రల్లో నటించారు. కాదా మహానటి సినిమాలో చిన్నప్పటి సావిత్రి, సుశీల పాత్రలో ఇద్దరు చిన్నారులు కనిపించారు. ముఖ్యంగా సావిత్రి లాంటి బరువైన పాత్రను పోషించిన పాప అందరినీ ఆకట్టుకుంది. 'ఆగిపో బాల్యమా..నవ్వులో నాట్యమా సరదా సిరిమువ్వలవుదాం' సాంగ్ తో పాటు పలు సీన్లలో ఆ పాప అభినయం,హవా భావాలు అందరినీ కట్టి పడేసాయి. ఇంతకీ ఆ పాప ఎవరో తెలుసా..? ప్రముఖ స్టార్ హీరో, నవ్వుల రెడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని.


మహానటి సినిమాలో చిన్నప్పటి సావిత్రి పాత్రలో చాలా చక్కగా నటించింది సాయి తేజశ్విని. అరే సావిత్రి చిన్నప్పుడు ఇలాగే ఉండేదా? అని పించేలా ఎంతో సహజంగా నటించింది స్టార్ కిడ్. ఈ సినిమా రిలీజ్ అయి అప్పుడే 8 ఏళ్ళు నిండిపోయాయి. ఇప్పుడి చిన్నారి మరింత క్యూట్ గా, బబ్లీగా మారిపోయింది. మహానటి తరువాత బేబీ, సిరివెన్నెల, సరిలేకు నీకెవ్వరు, ఎర్ర చీర తదితర సినిమాల్లో నటించింది సాయి తేజస్విని. గతంలో సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం దూరంగా ఉంటుంది. బహుశా సాయి తేజస్విని ప్రస్తుతం తన చదువుపై పూర్తి దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>