PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vuchitabassuscheme4fde4c30-52d3-49b0-a953-3e1d014d378b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vuchitabassuscheme4fde4c30-52d3-49b0-a953-3e1d014d378b-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపించుకుంటున్నారు.రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించింది.దీనివల్ల బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగి పురుషులకు కూర్చోవడానికి అవకాశం లేకుండా పోయింది. దాదాపుగా బస్సుల్లో ప్రయాణించే పురుషుల్లో 60 శాతం మంది నిలబడే ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంvuchitabassuscheme{#}prabhakar;Chintamaneni Prabhakar;Department of transportation;Ponnam Prabhakar Goud;Parakala Prabhakar;Good Newwz;Good news;RTC;Hyderabad;bus;CM;Minister;Government;Telangana;Congress;Reddyతెలంగాణ: మగవాళ్ల బాధలు గుర్తించిన రేవంత్ సర్కార్... అందుకే అలా..?తెలంగాణ: మగవాళ్ల బాధలు గుర్తించిన రేవంత్ సర్కార్... అందుకే అలా..?vuchitabassuscheme{#}prabhakar;Chintamaneni Prabhakar;Department of transportation;Ponnam Prabhakar Goud;Parakala Prabhakar;Good Newwz;Good news;RTC;Hyderabad;bus;CM;Minister;Government;Telangana;Congress;ReddyWed, 24 Jul 2024 11:55:00 GMTతెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపించుకుంటున్నారు.రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించింది.దీనివల్ల బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగి పురుషులకు కూర్చోవడానికి అవకాశం లేకుండా పోయింది. దాదాపుగా బస్సుల్లో ప్రయాణించే పురుషుల్లో 60 శాతం మంది నిలబడే ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది.ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు తప్పని సరి నెరవేరుస్తామని పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికైనా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసే సౌకర్యం ఏర్పాటు చేశారు. అయితే ఉచిత ప్రయాణం పథకం ప్రారంభం అయినప్పటి నుంచి మగవాళ్లకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పురుషులకు గుడ్ న్యూస్ చెప్పారు.ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. 

బస్సుల్లో రద్దీ ఉన్నా కూడా.. కూర్చొని ప్రయాణించే సౌకర్యాన్నికల్పిస్తామన్నారు. దీంతో పురుషులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేయవచ్చని తెలిపారు.పెరిగిన రద్దీ కారణంగా కొత్త బస్సులకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ పనితీరుపై మంత్రి హైదరాబాద్ లోని బస్ భవన్ లో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశంలో అన్ని విభాగాల పనితీరు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, కొత్త బస్సుల కొనుగోళ్లు, ఆర్థిక అంశాలపై ఉన్నత అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.తర్వాత మంత్రి మాట్లాడుతూ.. ఇప్పుడున్న బస్సు సర్వీసుల కంటే కూడా మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలని అధికారులకు సూచించారు. అన్ని జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ కు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు.త్వరలోనే మరిన్ని కొత్త బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయని, అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ చేరుకునే మెరుగైన రవాణా వసతి కల్పిస్తున్నామని, అలాగే 3035 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. కొత్త బస్సులు అందుబాటులోకి రానుండటంవల్ల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>