Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-vijay-devarakondaa20f41e6f-a395-4c2c-a4ef-4a43e9c358ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-vijay-devarakondaa20f41e6f-a395-4c2c-a4ef-4a43e9c358ea-415x250-IndiaHerald.jpg రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మరీనా విజయ్ దేవరకొండ ఆ తరువాత వరుస సినిమాలతో ప్రేక్షకులను పలుకరించాడు.అయితే ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోయారు.విజయ్ దేవరకొండ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో లైగర్ అనే సినిమాలో నటించాడు.భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.దీనితో విజయ్ కెరీర్ కాస్త స్లో అయింది.కానీ ప్రేక్షకులలో విజయ్ కి వున్నా క్రేజ్ మాత్రం#vijay devarakondaa{#}gowtam;Goodachari;Chitram;social media;kushi;Kushi;Devarakonda;Joseph Vijay;vijay deverakonda;sithara;Heroine;Director;Hero;Cinema;Reddyవిజయ్ దేవరకొండ : డియర్ రౌడీ ఫ్యాన్స్.. ప్లీజ్ ఆ ఫోటో షేర్ చేయకండి..!!విజయ్ దేవరకొండ : డియర్ రౌడీ ఫ్యాన్స్.. ప్లీజ్ ఆ ఫోటో షేర్ చేయకండి..!!#vijay devarakondaa{#}gowtam;Goodachari;Chitram;social media;kushi;Kushi;Devarakonda;Joseph Vijay;vijay deverakonda;sithara;Heroine;Director;Hero;Cinema;ReddyWed, 24 Jul 2024 10:15:38 GMT
 రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన  విజయ్ దేవరకొండ ఆ తరువాత వరుస సినిమాలతో ప్రేక్షకులను పలుకరించాడు.అయితే ఆ రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోయారు.విజయ్ దేవరకొండ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో లైగర్ అనే సినిమాలో నటించాడు.భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.దీనితో విజయ్ కెరీర్ కాస్త స్లో అయింది.కానీ ప్రేక్షకులలో విజయ్ కి వున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు.విజయ్ దేవరకొండ గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా  ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.దీనితో విజయ్ తన తరువాత సినిమా కథలను సెలెక్టివ్ గా ఎంచుకుంటున్నాడు.

ప్రస్తుతం రౌడీ హీరో జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి  తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్నది. ఇందులో దేవరకొండ విజయ్‌ గూఢచారి పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.తాజాగా ఈ సినిమాలోని విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ స్టిల్‌ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ట్రిమ్‌ చేసుకొని వైట్‌ డ్రెస్‌లో ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. ఈ స్టిల్‌ ప్రస్తుతం ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్నది.లీక్ అయిన స్టిల్ గురించి తెలుసుకున్న చిత్రయూనిట్‌ రంగలోకి దిగి, సోషల్‌ మీడియా నుంచి ఈ స్టిల్‌ని తొలగించే ప్రయత్నం చేసింది. కానీ అంతలోనే మరో స్టిల్‌ లీకైంది.దీంతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ స్పందిస్తూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. 'డియర్‌ రౌడీ ఫ్యాన్స్‌.. మీకు అద్భుతమైన థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడానికి మా టీమ్‌ ఎంతగానో శ్రమిస్తున్నది. ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్‌ జరుగుతున్నది. 60శాతంకు పైగా షూటింగ్‌ పూర్తయింది.త్వరలో ఫస్ట్‌లుక్‌ ను విడుదల చేస్తాం.దయచేసి ఆ ఫొటో షేర్‌ చేయొద్దు..' అంటూ సితార సంస్థ ఫ్యాన్స్ ను విజ్ఞప్తి చేసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>