MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedటాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన తెర‌కెక్కించిన సినిమా పురుషోత్తముడు. హాసిని సుధీర హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా యూనిట్ ఘనంగా ఫ్రీ రిలీజ్ వేడుక కూడా నిర్వహించింది. ఈ వేడుకలో దర్శక నిర్మాతలు మాట్లాడుతూ పురుషోత్తముడు కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పారు. అయితే హీరో రాజ్ తరుణ్ - లావణ్య చౌదరి గొడవ విషయంలో రాజ్ తరుణ్ ఇటీవల కాలంలో బాగా వార్తల్లోకి ఎక్కారు. లావణ్య చౌదరి .. రాజ్ తరుణ్ ఇద్దరూ కలిసి ఏడు ఎనిమిది సంవత్సరాల పాటు పpurushotam Udu movie; Raj Tarun ;Lavanya; Lavanya Choudhary; Raj Tarun purushotamudu; Raj Tarun Lavanya{#}Raj Tarun;Tarun Kumar;raj;choudary actor;police;you tube;Hero;ram pothineni;producer;Producer;Telugu;Cinemaరాజ్‌త‌రుణ్ - లావ‌ణ్య గొడ‌వ‌.. ' పురుషోత్త‌ముడు ' బిజినెస్ లాస్‌..?రాజ్‌త‌రుణ్ - లావ‌ణ్య గొడ‌వ‌.. ' పురుషోత్త‌ముడు ' బిజినెస్ లాస్‌..?purushotam Udu movie; Raj Tarun ;Lavanya; Lavanya Choudhary; Raj Tarun purushotamudu; Raj Tarun Lavanya{#}Raj Tarun;Tarun Kumar;raj;choudary actor;police;you tube;Hero;ram pothineni;producer;Producer;Telugu;CinemaWed, 24 Jul 2024 12:56:42 GMTటాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన తెర‌కెక్కించిన సినిమా పురుషోత్తముడు. హాసిని సుధీర హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా యూనిట్ ఘనంగా ఫ్రీ రిలీజ్ వేడుక కూడా నిర్వహించింది. ఈ వేడుకలో దర్శక నిర్మాతలు మాట్లాడుతూ పురుషోత్తముడు కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పారు. అయితే హీరో రాజ్ తరుణ్ - లావణ్య చౌదరి గొడవ విషయంలో రాజ్ తరుణ్ ఇటీవల కాలంలో బాగా వార్తల్లోకి ఎక్కారు. లావణ్య చౌదరి .. రాజ్ తరుణ్ ఇద్దరూ కలిసి ఏడు ఎనిమిది సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నారని ... రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య చౌదరి మీడియాకు ఎక్కడంతో పాటు రాజ్ పై పోలీసు కేసు కూడా పెట్టింది.


ఈ గొడవ జరిగిన కొద్ది రోజులకే పురుషోత్తముడు సినిమా రిలీజ్ అవుతుండడంతో ఆ గొడవ ప్రభావం ఈ సినిమాపై పడిందా ? అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. రాజ్ తరుణ్ వల్ల పురుషోత్తముడు బిజినెస్ లాస్ అయిందా ? అనే ప్రశ్నకు నిర్మాత రమేష్ సమాధానం ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పగా ఆలోచిస్తారని సినిమాలో కంటెంట్ బాగుండి .. నటీనటులు యాక్టింగ్ బాగుంటే ఆ సినిమాను సూపర్ హిట్ చేస్తారని తెలిపారు. ఒక సినిమా వెనక 2000 మందికి పైగా కష్టపడి పని చేస్తారన్న విషయం ప్రేక్షకులకు కూడా తెలుసు అని  ... ఇక బిజినెస్ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుంది అనే విషయాల్లో తాము ఎప్పుడు అంచనాలు పెట్టుకోలేదని అది పూర్తిగా క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుందని రమేష్ చెప్పారు.


ఇక ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ రాజ్ తరుణ్ వ్యక్తిగత విషయాలు కారణంగా బిజీగా ఉన్నారని ..  తామే పెద్ద ఎత్తున పబ్లిసిటీ నిర్వహించామని యూట్యూబ్ లోను పురుషోత్తముడు టీజర్ ... ట్రైలర్ పాటలకు మిలియ‌న్ల కొద్ది వ్యూస్  వచ్చాయని ఇది కచ్చితంగా క్వాలిటీ ఉన్న సినిమా కావడంతో ప్రజలు ఈ సినిమాను సూపర్ హిట్ చేస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక రాజ్ తరుణ్ ఫోన్ లో కూడా అందుబాటులో లేకపోవడం వల్ల వీడియా బైట్ పంపలేకపోయారు .. వ్యక్తిగత విషయాలను సినిమాలోని పాత్రతో పోల్చలేం పురుషోత్తముడు సినిమాలో పాత్రకు రాజ్ తరుణ్ నూటికి నూరు శాతం న్యాయం చేసినట్టు తెలిపారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>