Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-b72ee223-1a34-4e0a-99db-d2dcd0adb6ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-b72ee223-1a34-4e0a-99db-d2dcd0adb6ee-415x250-IndiaHerald.jpgకింగ్ నాగార్జున ఊహించని విధంగా టాలీవుడ్ కోలీవుడ్ లో సెకండ్ హీరొగా మారిపోయాడు. అదేంటి సీనియర్ స్టార్ నాగార్జునకు సెకండ్ హీరో అవ్వాల్సిన కర్మ ఏంటి అనుకోవచ్చు. మన తెలుగు స్టార్స్ లో పాత్ర నచ్చితే చాలు సినిమాలో నిడివి గురించి ఆలోచించకుండా చేసే నటుల్లో నాగార్జున ఒకరు. ఆయన చేయని ప్రయోగం అంటూ లేదు. ఐతే నాగార్జున లాంటి హీరో వీల్Nagarjuna {#}sekhar;Akkineni Nagarjuna;dhanush;Lokesh;Lokesh Kanagaraj;Nijam;Rajani kanth;Director;Audience;Hero;Telugu;Tollywood;Cinema;Newsనాగార్జున సెకండ్ హీరో అయ్యాడేంటి..?నాగార్జున సెకండ్ హీరో అయ్యాడేంటి..?Nagarjuna {#}sekhar;Akkineni Nagarjuna;dhanush;Lokesh;Lokesh Kanagaraj;Nijam;Rajani kanth;Director;Audience;Hero;Telugu;Tollywood;Cinema;NewsWed, 24 Jul 2024 14:55:00 GMTకింగ్ నాగార్జున ఊహించని విధంగా టాలీవుడ్ కోలీవుడ్ లో సెకండ్ హీరొగా మారిపోయాడు. అదేంటి సీనియర్ స్టార్ నాగార్జునకు సెకండ్ హీరో అవ్వాల్సిన కర్మ ఏంటి అనుకోవచ్చు. మన తెలుగు స్టార్స్ లో పాత్ర నచ్చితే చాలు సినిమాలో నిడివి గురించి ఆలోచించకుండా చేసే నటుల్లో నాగార్జున ఒకరు. ఆయన చేయని ప్రయోగం అంటూ లేదు. ఐతే నాగార్జున లాంటి హీరో వీల్ చెయిర్ లో ఉండి సినిమాను నడిపించాడు. అందుకే తను చేస్తున్న పాత్రలు మాట్లాడతాయని ఆయన అనుకుంటారు.

ఈ ఇయర్ మొదట్లోనే నా సామిరంగ తో సూపర్ హిట్ అందుకున్న నాగార్జున తన నెక్స్ట్ సినిమా ఏంటన్న క్లారిటీ ఇవ్వలేదు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర సినిమాలో సెకండ్ హీరోగా చేస్తున్నాడు. సినిమాలో ధనుష్ మెయిన్ హీరో కాగా నాగార్జున సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ రోల్ ఆడియన్స్ ని ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు.

ఇదిలాఉంటే మరో సినిమాలో నాగార్జున విలన్ గా నటిస్తున్నాడని చెబుతున్నారు. సూపర్ స్టార్ రజినికాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నాగార్జున విలన్ గా నటిస్తారని చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో కానీ అదే వాస్తవం అయితే అక్కినేని ఫ్యాన్స్ కచ్చితంగా అసంతృప్తిగా ఉంటారని చెప్పొచ్చు. సీనియర్ స్టార్ గా నాగార్జున విలన్ గా చేయడం ఆయనే లీడ్ గా ఉంటే ఓకే కానీ ఇలా ఒక హీరోకి విలన్ గా చేసి ఆయనతో ఫైట్ చేయడం కొట్టించుకోవడం అసలు యాక్సెప్ట్ చేయరు. మరి ఈ విషయంపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. నా సామిరంగ డైరెక్టర్ విజయ్ బిన్ని డైరెక్షన్ లోనే నాగ్ సినిమా ఉంటుందని వార్తలు రాగా ఆ సినిమా గురించి కూడా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>