HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/corn2b73880b-c57f-49dd-9ac1-b33924312954-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/corn2b73880b-c57f-49dd-9ac1-b33924312954-415x250-IndiaHerald.jpgవర్షా కాలంలో మొక్క జొన్న తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే? మొక్కజొన్నలో ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్ లు కూడా అధికంగా ఉంటాయి వర్షా కాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తు తింటే చాలా ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. కాల్చిన మొక్కజొన్నను మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరం ఆరోగ్యాంగా ఉండడానికి మంచి ప్రయోజనcorn{#}Vitamin C;Potassium;Iron;Corn;Heart Attack;Divya Bhatnagar;Pregnant;Shakti;Heart;Vitamin;Cholesterol;Manamవర్షా కాలంలో మొక్క జొన్న తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే?వర్షా కాలంలో మొక్క జొన్న తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే?corn{#}Vitamin C;Potassium;Iron;Corn;Heart Attack;Divya Bhatnagar;Pregnant;Shakti;Heart;Vitamin;Cholesterol;ManamTue, 23 Jul 2024 14:16:00 GMTమొక్కజొన్నలో ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్ లు కూడా  అధికంగా ఉంటాయి  వర్షా కాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తు తింటే చాలా ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. కాల్చిన మొక్కజొన్నను మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరం ఆరోగ్యాంగా ఉండడానికి మంచి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ మొక్కజొన్న పొత్తు తింటే మన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మొక్కజొన్న మలబద్దకం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. 


మొక్కజొన్నలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్  అధికంగా ఉంటుంది.  ఒక్క కాల్చిన మొక్కజొన్నను తింటే మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే దీన్ని మీరు ఉడకబెట్టి కూడా తినొచ్చు మొక్కజొన్నలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.కంటి చూపును కూడా మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది.వీటిని మన డైట్ లో చేర్చుకుంటే కంటిచూపు బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది  ఎలాంటి కంటి సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది. కాల్చిన మొక్కజొన్నను తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని తినడం వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుందట. 


అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్నలో విటమిన్ సి, బయోఫ్లవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫైబర్ వంటి లక్షణాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మొక్కజొన్నలోని ఈ లక్షణాలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. మొక్కజొన్నల్లో ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను బలోపేతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. దీనిని తింటే ఆర్థరైటిస్ నొప్పులు కూడా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్నలో విటమిన్ ఎ, విటమిన్ సి తో పాటుగా ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మొక్కజొన్నలను  ప్రతి రోజు తింటే మన శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా మన చర్మం కూడా హెల్తీగా, ప్రకాశవంతంగా ఉంటుంది.  క్యాన్సర్‌లను తరిమికొట్టడంలో కూడా మొక్కజొన్న చాలా బాగా ఉపయోగపడుతుంది. 


ఇందులోని ఫెలోరిక్‌ యాసిడ్‌ అనే శక్తి వంతమైన యాంటీయాక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తుంది. ఎముకలు బలంగా,దృఢంగా ఉండాలంటే మొక్కజొన్నను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మెగ్నీషియం, ఐరన్‌, మెగ్నీషీయం,కాపర్‌, ఫాస్పరస్‌ ఎముకలను గట్టి పడేలా చేస్తాయి.ఇందులోని ఎన్నో దివ్య గుణాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని సురక్షితంగా,ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కిడ్నీ సమస్యలకు చెక్‌ పెట్టడంలో కూడా మొక్క జొన్న ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఉండే మినరల్స్‌ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మొక్క జొన్నలో ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో ఉండే రక్త హీనతను తగ్గిస్తుంది.మొక్క జొన్నలో విటమిన్‌ బీ12 పుష్కలంగా ఉంటుంది. అలాగే ఐరన్‌ కూడా అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల అభివృద్ధి పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వీటిని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.మొక్కజొన్న రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. డయాబెటీస్‌ని మరియు అధిక రక్త పోటును నియంత్రిస్తుందని. దీని నుంచి విటమిన్స్‌ మరియు మినరల్స్‌ పుష్కలంగా లభిస్తాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>