EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/biden67e47e11-b1b6-4678-96af-8c2ebaf595d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/biden67e47e11-b1b6-4678-96af-8c2ebaf595d5-415x250-IndiaHerald.jpgఅగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబరులో జరగనున్నాయి. ఇప్పటికే అధికార డెమొక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ప్రతిపక్ష రిపబ్లిక్ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలిచారు. ఇప్పటికే ఇరువురు నేతలు నిధులు సమీకరణ, ముఖాముఖీ మీటింగ్ లు, ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అయితే ట్రంప్ ముందు బైడెన్ తేలిపోవడంతో.. ఇక ఆయన గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు అంతా. దీంతో బైడెన్ ను మార్చాలని ఆ పార్టీ ప్రతినిధులు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. చివరకు తాను తప్పుకుంటుbiden{#}American Samoa;Manam;Donald Trump;Elections;Partyబైడెన్‌ ఔట్‌.. మన కమలం విరిసేనా..?బైడెన్‌ ఔట్‌.. మన కమలం విరిసేనా..?biden{#}American Samoa;Manam;Donald Trump;Elections;PartyTue, 23 Jul 2024 11:00:00 GMTఅగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబరులో జరగనున్నాయి. ఇప్పటికే అధికార డెమొక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ప్రతిపక్ష రిపబ్లిక్ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలిచారు. ఇప్పటికే ఇరువురు నేతలు నిధులు సమీకరణ,  ముఖాముఖీ మీటింగ్ లు, ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు.


అయితే ట్రంప్ ముందు బైడెన్ తేలిపోవడంతో.. ఇక ఆయన గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు అంతా. దీంతో  బైడెన్ ను మార్చాలని ఆ పార్టీ ప్రతినిధులు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. చివరకు తాను తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించారు. తన వారసురాలిగా కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు. అయితే దీని వెనుక పెద్ద కథే నడిచింది. అమెరికా సీఐఏ వ్యవహారాల గురించి ఓ సీనియర్ జర్నలిస్ట్ వివరించారు.


ట్రంప్ గురించి అక్కడ చాలా కథనాలు వెలువడతాయి. కాకపోతే అవి ఆయనకు వ్యతిరేకంగా ఉంటాయి. ఆయన భాషను హైలెట్ చేస్తూ రెచ్చగొట్టే రీతిలో ఉంటాయి. ఇదే క్రమంలో విదేశీ ప్రభుత్వాలను కూల దోయాలన్నా ఓ ఫార్ములాను అనుసరిస్తారు. అతని గురించి నెగిటివ్ గా ప్రచారం చేస్తూ.. జనాల మైండ్ సెట్ లను మార్చేస్తారు. వారి నాయకుడిని వివాదస్పదంగా చూపిస్తారు. వారి వారి చెత్త పరిశోధనలతో ముప్పేటా దాడి చేసి.. అతని అభిప్రాయాలకు విలువ లేకుండా చేస్తారు. ఆ తర్వాత ప్రజల్లో ఆ నాయకుడిపై శత్రుత్వ భావనను పెంపొందిస్తారు. దీనివల్ల ప్రజలంతా ఆ నాయకుడి వల్ల మనం ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాం అనే ఫీలింగ్ తీసుకువస్తారు. ఆ తర్వాత పక్కకి తప్పిస్తారు.


2020లో ట్రంప్ విషయంలో ఇదే జరిగింది. ఆ తర్వాత కూడా అతనిపై కేసులు పెట్టి విచారణలు, దర్యాప్తులు చేసి నేరస్థుడిగా చిత్రీకరించారు. ఇప్పుడు బైడెన్ ను కూడా అదే విధంగా చూపించారు. చివరకు అతడిని అనారోగ్య సమస్య సాకుగా చెప్పి తనకు తాను గా తప్పుకునే పరిస్థితులను కల్పించారు. మొత్తానికి బైడెన్‌ పోటీ నుంచి తప్పుకున్నారు. మన కమలాహారిస్‌కు అన్నీ అనుకూలిస్తే అమెరికా అధ్యక్షురాలు కూడా కావచ్చు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>