Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/hero-nitin-latest-photo-stills415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/hero-nitin-latest-photo-stills415x250-IndiaHerald.jpgలవర్ బోయ్ నితిన్ మళ్లీ రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో డీలా పడ్డాడు. అతనికి ఇప్పుడు ఒక సూపర్ హిట్ కచ్చితంగా కావాలి అందుకే ఈసారి రెండు సినిమాలతో నితిన్ ప్రయత్నిస్తున్నాడు. అందులో ఒకటి ఆల్రెడీ భీషంతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో చేస్తున్న రాబిన్ హుడ్ కాగా మరోటి వేణు శ్రీరాం డైరెక్షన్ లో వస్తున్న తమ్ముడు. ఈ రెండు సినిమాలు మంచి అంచనాలతోనే వస్తున్నాయి.Nitin Tammudu{#}dil raju;Paritala Sriram;Venu Sreeram;Tammudu;Venky Kudumula;Thammudu;Success;Heroine;Director;Hero;Cinemaతమ్ముడితో నితిన్ సాహసం..!తమ్ముడితో నితిన్ సాహసం..!Nitin Tammudu{#}dil raju;Paritala Sriram;Venu Sreeram;Tammudu;Venky Kudumula;Thammudu;Success;Heroine;Director;Hero;CinemaTue, 23 Jul 2024 17:15:00 GMTలవర్ బోయ్ నితిన్ మళ్లీ రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో డీలా పడ్డాడు. అతనికి ఇప్పుడు ఒక సూపర్ హిట్ కచ్చితంగా కావాలి అందుకే ఈసారి రెండు సినిమాలతో నితిన్ ప్రయత్నిస్తున్నాడు. అందులో ఒకటి ఆల్రెడీ భీషంతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో చేస్తున్న రాబిన్ హుడ్ కాగా మరోటి వేణు శ్రీరాం డైరెక్షన్ లో వస్తున్న తమ్ముడు. ఈ రెండు సినిమాలు మంచి అంచనాలతోనే వస్తున్నాయి. భీష్మ సక్సెస్ తర్వాత వెంకీ కుడుముల తో నితిన్ చేస్తున్న ఈ సినిమా పై బజ్ బాగుంది.

వెంకీ తీసిన రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి కాబట్టి ఇది కూడా అదే రేంజ్ ఫలితాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నారు. ఇక నితిన్ తమ్ముడు సినిమాను కూడా వేణు శ్రీరాం హిట్ టార్గెట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న తమ్ముడు సినిమాకు భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారని తెలుస్తుంది. నితిన్ కెరీర్ లో ఇప్పటివరకు పెట్టని బడ్జెట్ పెట్టేస్తున్నారట. దానికి కారణం సినిమా బాగా వస్తుండటమే అని టాక్.

వేణు శ్రీరాం మీద నమ్మకంతో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ పై లెక్కకు మించి బడ్జెట్ పెట్టేస్తున్నారట. ఐతే అది ఎంత అన్నది బయటకు రాలేదు. నితిన్ తమ్ముడు సినిమాలో నిన్నటితరం హీరోయిన్ లయ నటిస్తుంది. ఆమె నితిన్ కి సిస్టర్ గా చేస్తుంది. సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా భారీగా ఉంటాయని తెలుస్తుంది. మరి నితిన్ చేస్తున్న ఈ క్రేజీ అటెంప్ట్ అతనికి సక్సెస్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి. నితిన్ మాత్రం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాలతో కచ్చితంగా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. అందుకే ఏ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. నితిన్ కి ఈ రెండు సక్సెస్ అయితే మాత్రం మళ్లీ హీరో లైన్లోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>