MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgతన అనారోగ్య సమస్యల నుండి బయటపడి చేసిన ‘ఖుషి’ అనుకున్న స్థాయిలో సక్సస్ కాకపోవడంతో సమంత దిగాలు పడిన విషయం తెలిసిందే. ఒకప్పుడు తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆమెకు ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడ లేదు. అయినా పరిస్థితులతో పోరాటం చేస్తూ ఆమె తన ఫిట్నెస్ ను పెంచుకోవడమే కాకుండా డానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో తరుచూ షేర్ చేస్తూ తన అభిమానులకు దగ్గర కావడానికి ఆమె నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఊహించని అదృష్టం ఆమె తలుపు తట్టినట్లు samantha{#}anil music;raj;Samantha;Blockbuster hit;Allu Arjun;NET FLIX;INTERNATIONAL;August;Heroine;Cinema;Yevaru;Telugu;Newsసమంత తలుపు తట్టిన ఊహించని అదృష్టం !సమంత తలుపు తట్టిన ఊహించని అదృష్టం !samantha{#}anil music;raj;Samantha;Blockbuster hit;Allu Arjun;NET FLIX;INTERNATIONAL;August;Heroine;Cinema;Yevaru;Telugu;NewsTue, 23 Jul 2024 09:23:00 GMTతన అనారోగ్య సమస్యల నుండి బయటపడి చేసిన ‘ఖుషి’ అనుకున్న స్థాయిలో సక్సస్ కాకపోవడంతో సమంత దిగాలు పడిన విషయం తెలిసిందే. ఒకప్పుడు తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆమెకు ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా కూడ లేదు. అయినా పరిస్థితులతో పోరాటం చేస్తూ ఆమె తన ఫిట్నెస్ ను పెంచుకోవడమే కాకుండా డానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో తరుచూ షేర్ చేస్తూ తన అభిమానులకు దగ్గర కావడానికి ఆమె నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది.



ఇలాంటి పరిస్థితుల మధ్య ఊహించని అదృష్టం ఆమె తలుపు తట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ది ఫ్యామిలీ మ్యాన్ ‘ఫర్జీ’ లాంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ లకు దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డికె త్వరలో ‘రక్త్ భ్రమండ్’ పేరుతో ఒక హారర్ వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2018లో ‘తుంబాడ్’ అనే వెబ్ సిరీస్ తో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రహి అనిల్ భర్వే ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.



నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో భారీ స్థాయిలో నిర్మాణం జరుపుకోబోతున్న ఈ వెబ్ సిరీస్ లో ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని బ్యాక్ డ్రాప్ లో చూసేవారికి భయం కలిగించే సన్నివేశాలతో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. 2025 ఆగష్టు స్ట్రీమింగ్ లక్ష్యంగా ఈ వెబ్ సిరీస్ నిర్మాణం త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.



ఊహకందని మలుపులతో ఈ వెబ్ సిరీస్ ను డిజైన్ చేసినట్లు టాక్. ఈ వెబ్ సిరీస్ లో సమంత తో పాటు సిద్దార్థ్ రాయ్ కపూర్ వామికా గబ్బిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అని తెలుస్తోంది. సమంత టైటిల్ రోల్ పోషించిన సిటాడెల్ హనీ బన్నీ రిలీజ్ అవుతోంది. ఈ కొత్త వెబ్ సిరీస్ తో సమంత తిరిగి ట్రాక్ లోకి వచ్చే అవకాశం ఉంది..










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>