Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/dukuduga-cinimalu-chestunna-meenakshi-ekamga-anni-cinimalac6461db5-fcb9-4c0d-b0e1-267d2dc56535-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/dukuduga-cinimalu-chestunna-meenakshi-ekamga-anni-cinimalac6461db5-fcb9-4c0d-b0e1-267d2dc56535-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరుకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ అయ్యింది.. టాలీవుడ్ టూ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఖాతాలో మరో బడా ప్రాజెక్ట్ కూడా పడింది.. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను వదులుతుంది.. తాజాగా అదిరిపోయే స్టిల్స్ ను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్socialstars lifestyle{#}Chiranjeevi;Allu Arjun;bhama;trivikram srinivas;varun tej;Guntur;Red chilly powder;Viswak sen;Nijam;Amarnath K Menon;vehicles;Venkatesh;anil music;choudary actor;bhaskar;Baba Bhaskar;mahesh babu;India;BEAUTY;Tollywood;Heroine;Tamil;Hero;Cinemaదూకుడుగా సినిమాలు చేస్తున్న మీనాక్షి.. ఏకంగా అన్ని సినిమాలా..?దూకుడుగా సినిమాలు చేస్తున్న మీనాక్షి.. ఏకంగా అన్ని సినిమాలా..?socialstars lifestyle{#}Chiranjeevi;Allu Arjun;bhama;trivikram srinivas;varun tej;Guntur;Red chilly powder;Viswak sen;Nijam;Amarnath K Menon;vehicles;Venkatesh;anil music;choudary actor;bhaskar;Baba Bhaskar;mahesh babu;India;BEAUTY;Tollywood;Heroine;Tamil;Hero;CinemaTue, 23 Jul 2024 12:30:00 GMTటాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరుకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ అయ్యింది.. టాలీవుడ్ టూ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఖాతాలో మరో బడా ప్రాజెక్ట్ కూడా పడింది.. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను వదులుతుంది.. తాజాగా అదిరిపోయే స్టిల్స్ ను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అయితే మహేష్ బాబు పక్కన శ్రీలీలా హైలెట్ అయ్యింది. పాప సెకండ్ హీరోయిన్ గా మిగిలింది.. ఇక ఇప్పుడు మీనాక్షి వరుసగా క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ ఫామ్ లో ఉంది. ప్రస్తుతం మీనాక్షి చేతిలో తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాతో పాటుగా దుల్కర్ లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్ సినిమాలో నటిస్తుంది..

అలాగే మెగా వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా లో కూడా హీరోయిన్ చేస్తుంది.. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ అమ్మడు దగ్గరకు వచ్చింది. అనిల్ రావిపూడి, వెంకీ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా సెలెక్ట్ అయ్యినట్లు తెలుస్తుంది.. ఇలా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంది..ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు హిట్ 2 తో హిట్ సొంతం చేసుకుంది.ఆ తరువాత తెలుగులో మెగా స్టార్ చిరంజీవి పక్కన ఒక కథానాయికగా 'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది. ఇది ఇంకా పెద్ద సినిమా అనే చెప్పాలి. అటు అందం, ఇటు అభినయం రెండింటిలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్న మీనాక్షి విశ్వక్ సేన్ పక్కన 'మెకానిక్ రాకీ' సినిమాలో కథానాయికగా చేస్తోంది.సైంధవ్' సినిమాతో ఫ్లాప్ అందుకున్న వెంకటేష్ తన నెక్స్ట్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశారు. తనకి రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడితో కొత్త సినిమా ప్రకటించారు వెంకీ. ఉగాది నాడు అఫీషియల్‌గా ప్రకటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని సెలక్ట్ చేసినట్లు సమాచారం.

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ది గోట్, లక్కీ భాస్కర్ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉంది మీనాక్షి. త్వరలోనే వెంకీ-అనిల్ రావిపూడి చిత్ర షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశం ఉంది.ఇలా వరస సినిమాలతో రానున్న రోజుల్లో నెలకు ఒక సినిమా అయినా మీనాక్షి చౌదరివి విడుదల అయ్యేట్టుగా వున్నాయి. ఇంకేముంది మీనాక్షి ఇప్పుడు బిజీగా వున్న నటీమణుల్లో ఒక నటీమణి అయిపొయింది.ఇదిలా ఉంటే ఈ భామ మరో పాన్ ఇండియా సినిమా.. కాదు కాదు.. పాన్ వరల్డ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది.ఇక ఈ పుష్ప 2 సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్ తో కలిసి ఈ సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరితో పాటు.. సంయుక్త మీనన్ కూడా నటించనుందట. ఇక ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>