Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/viralcb3a5470-6b33-48e8-a7f2-c2bf06879312-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/viralcb3a5470-6b33-48e8-a7f2-c2bf06879312-415x250-IndiaHerald.jpgవర్షాకాలం ప్రారంభమైంది. కొన్ని రాష్ట్రాలలో అయితే అతి భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. ఇంకొన్ని రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలందరూ కూడా ఆనందంలో ఇక పంట పొలాలను సాగు చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు అని చెప్పాలి. ఇక మరికొన్ని చోట్ల భారీ వర్షాలు నేపథ్యంలో ఏకంగా నదులు పొంగిపొరులుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో వరద ముప్పు ఉంది అనే అధికారులు ఇక ఇలా వరద ప్రభావిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఇక ఇలా భారీ వర్షాలు కారణంగా ఇపViral{#}Krishna River;Srisailam;Nandyala;Maha;templeభారీ వర్షం.. మూడు రోజుల్లో మునిగిపోనున్న గుడి?భారీ వర్షం.. మూడు రోజుల్లో మునిగిపోనున్న గుడి?Viral{#}Krishna River;Srisailam;Nandyala;Maha;templeTue, 23 Jul 2024 10:30:00 GMTవర్షాకాలం ప్రారంభమైంది. కొన్ని రాష్ట్రాలలో అయితే అతి భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. ఇంకొన్ని రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలందరూ కూడా ఆనందంలో ఇక పంట పొలాలను సాగు చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు అని చెప్పాలి. ఇక మరికొన్ని చోట్ల భారీ వర్షాలు నేపథ్యంలో ఏకంగా నదులు పొంగిపొరులుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో వరద ముప్పు ఉంది అనే అధికారులు ఇక ఇలా వరద ప్రభావిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


 అయితే ఇక ఇలా భారీ వర్షాలు కారణంగా ఇప్పటికే చాలా ప్రాంతాలు జనావాసాలు అస్తవ్యస్తంగా మారిపోయాయ్. ఏకంగా ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ఏపీలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి భారీగా వరద వచ్చి చేరుతుంది అన్న విషయం తెలిసిందే. ఇలా కృష్ణానది నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో.. శ్రీశైలం జలాశయం ఏకంగా నిండుకుండలా మారిపోయింది. ఇక ఇలాంటి భారీ వర్షాలు నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి పక్కనే ఉన్న ఒక గుడి మరికొన్ని రోజుల్లో మునిగిపోబోతుంది అన్నది తెలుస్తోంది.



 నంద్యాల జిల్లాలోని సంగమేశ్వర ఆలయాన్ని ప్రస్తుతం కృష్ణా జలాలు చుట్టుముట్టయ్. ఆలయంలోని వేపదారు శివలింగాన్ని ఇప్పటికే కృష్ణమ్మ తాకింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆలయ పూజారులు శివలింగానికి ప్రత్యేక పూజలు చేసి ఇక కృష్ణమ్మకు సారే సమర్పించారు. అయితే ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల్లో ఆలయం పూర్తిగా మునిగిపోతుంది అంటూ ఆలయ అర్చకులు చెప్పారు. ఒకవేళ ఇదే జరిగితే మళ్లీ ఆలయాన్ని సందర్శించుకునేందుకు ఎనిమిది నెలల సమయం పడుతుంది అని చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల శివలింగాన్ని కృష్ణమ్మ తాకిన నేపథ్యంలో ఇక ఆ మహా శివునికి ప్రత్యేక పూజలు చేసి, నదికి సారి సమర్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>