MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pushpa-two69784f52-97e3-4ed4-addb-dfdb1f27656b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pushpa-two69784f52-97e3-4ed4-addb-dfdb1f27656b-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా యొక్క రెండవ భాగాన్ని మొదట ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఈ సినిమా ప్రచారాలను కూడా మొదలు పెట్టారు. దానితో ఈ మూవీ కచ్చితంగా ఆగస్టు 15 వ తేదీన విడుదల అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా పనులు ఆగస్టు 15 వ తేదీ వరకు పూర్తి కpushpa two{#}Arjun;dhanush;Akkineni Nagarjuna;sekhar;December;News;Hero;Cinema"పుష్ప 2" పై ఓ కన్నేసిన కుబేర యూనిట్.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?"పుష్ప 2" పై ఓ కన్నేసిన కుబేర యూనిట్.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?pushpa two{#}Arjun;dhanush;Akkineni Nagarjuna;sekhar;December;News;Hero;CinemaTue, 23 Jul 2024 11:32:00 GMTఅల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా యొక్క రెండవ భాగాన్ని మొదట ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఈ సినిమా ప్రచారాలను కూడా మొదలు పెట్టారు. దానితో ఈ మూవీ కచ్చితంగా ఆగస్టు 15 వ తేదీన విడుదల అవుతుంది అని అంతా అనుకున్నారు.

కానీ ఈ సినిమా పనులు ఆగస్టు 15 వ తేదీ వరకు పూర్తి కావడం అసంభవం అనే ఉద్దేశంతో ఈ మూవీ ని పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదీన ఖచ్చితంగా విడుదల అవుతుంది అనే సమీకరణాలు కనిపించిన తర్వాత మళ్లీ ఈ మూవీ షూటింగ్ పనులు అనుకున్నంత స్పీడ్ గా జరగడం లేదు అని , ఈ మూవీ మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా విడుదల తేదీ అని ప్రకటించిన తర్వాత దాని దగ్గరికి ఎవరూ రాలేదు.

మూవీ పోస్ట్ పోన్ కాగానే ఆ తేదీన ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక డిసెంబర్ 6 వ తేదీన కూడా ఈ మూవీ పోస్ట్ పోన్ అయితే ఆ మూవీ పై కూడా ఓ మూవీ యూనిట్ కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ధనుష్ , నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఆగస్టు 6 వ తేదీన కనుక పుష్ప పార్ట్ 2 మూవీ విడుదల కాలనట్లయితే ఆ తేదీన కుబేర మూవీ ని విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>