PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/-jagan-mohan-reddy0a04295a-4dce-4807-86af-3df1af934772-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/-jagan-mohan-reddy0a04295a-4dce-4807-86af-3df1af934772-415x250-IndiaHerald.jpgఏపీ విభజన కంటే..జగన్‌ పాలనలోనే భారీ నష్టం జరిగిందని బాంబ్‌ పేల్చారు ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన గవర్నర్... ఏపీకి విభజన నష్టాలకంటే ఎక్కువ నష్టం గత ప్రభుత్వ విధానాల వల్ల జరిగిందని చెప్పారు ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్. jagan mohan reddy{#}vedhika;High court;electricity;Government;Governor;Amaravati;Andhra Pradesh;YCP;Assembly;Industriesగవర్నర్: ఏపీ విభజన కంటే..జగన్‌ పాలనలోనే భారీ నష్టం?గవర్నర్: ఏపీ విభజన కంటే..జగన్‌ పాలనలోనే భారీ నష్టం?jagan mohan reddy{#}vedhika;High court;electricity;Government;Governor;Amaravati;Andhra Pradesh;YCP;Assembly;IndustriesMon, 22 Jul 2024 11:23:00 GMTఏపీ విభజన కంటే..జగన్‌ పాలనలోనే భారీ నష్టం జరిగిందని బాంబ్‌ పేల్చారు ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన గవర్నర్... ఏపీకి విభజన నష్టాలకంటే ఎక్కువ నష్టం గత ప్రభుత్వ విధానాల వల్ల జరిగిందని చెప్పారు ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్.

ప్రజా వేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం విధ్వంసకర విధానాన్ని ప్రారంభించిందని వైసీపీ సర్కార్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తెలిపారు ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్.  ఏపీలో రాజ్యాంగకరమైన విచ్ఛిన్నం జరిగిందా అనే అంశంపై న్యాయ విచారణ చేపట్టాలని హైకోర్టు కోరిందని వెల్లడించారు. బ్రాండ్ ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని.. గత ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు తరలిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్.  

గత ప్రభుత్వ విధానాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావం చూపిందని వెల్లడించారు. గతంలో అధిక పన్నులు విధించారు.. విద్యుత్ రంగంలో రుణాలు పెంచేశారని వైసీపీని టార్గెట్‌ చేశారు. గత ప్రభుత్వంలో భారీగా బిల్లులును పెండింగులో పెట్టి చెల్లింపులు నిలిపేశారని... చెల్లింపుల కోసం కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్.


ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లులను చెల్లించాలని గతంలో 25 వేల కేసులు కోర్టుల్లో దాఖలయ్యాయని.. 2019-24 మధ్య కాలంలో మూలధన వ్యయాన్ని 60 శాతం మేర తగ్గించేశారని పేర్కొన్నారు. మూలధన వృద్ధి రేటు 26.4 శాతం నుంచి 3.4 శాతానికి పడిపోయిందని..ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. గత వ్రభుత్వంలో అమరావతి ప్రాంతం పూర్తిగా నాశనమైందని... గత సర్కార్ విధానాల వల్ల యువత మాదక ద్రవ్యాల బారిన పడ్డారన్నారు ఏపీ గవర్నర్‌ అబ్దుల్ నజీర్.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>