LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health645134de-4fd3-4aef-bd63-a774dcacd021-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health645134de-4fd3-4aef-bd63-a774dcacd021-415x250-IndiaHerald.jpgప్రతిరోజు నానబెట్టిన 2 బాదంలు తింటే మీ శరీరంలో జరిగే అద్భుతాలివే? బాదం పప్పుతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ప్రతిరోజూ నానబెట్టిన రెండు బాదంలను డైట్లో చేర్చుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.డ్రైఫ్రూట్స్‌లో బాదం కూడా ఒకటి. దీన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్,యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.మంచి ఆరోగ్యం..రోజూ నానబెట్టిన రెండు బాదంలు తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇHealth{#}Magnesium;Almonds;Heart;Vitaminప్రతిరోజు నానబెట్టిన 2 బాదంలు తింటే మీ శరీరంలో జరిగే అద్భుతాలివే?ప్రతిరోజు నానబెట్టిన 2 బాదంలు తింటే మీ శరీరంలో జరిగే అద్భుతాలివే?Health{#}Magnesium;Almonds;Heart;VitaminMon, 22 Jul 2024 13:30:00 GMTబాదం పప్పుతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ప్రతిరోజూ నానబెట్టిన రెండు బాదంలను డైట్లో చేర్చుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటో  ఇప్పుడు తెలుసుకుందాం.డ్రైఫ్రూట్స్‌లో బాదం కూడా ఒకటి. దీన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు,  ప్రోటీన్స్,యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.మంచి ఆరోగ్యం..రోజూ నానబెట్టిన రెండు బాదంలు తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఇ,ఐరన్, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కళంగా ఉంటాయి.ఎక్కువ బాదం తీసుకోవడం వల్ల ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ పవర్‌ కూడా పెరుగుతుంది. అయితే,  ప్రతి రోజు రాత్రి  నానబెట్టినవి ఉదయం పొట్టు తీసి తినాలి. దీంతో  మంచి ఆరోగ్యం కలుగుతుంది. గుండె ఆరోగ్యం.. బాదం నానబెట్ట తీసుకోవడం వల్ల  శరీరానికి ఆరోగ్యకరం. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం ఉంటుంది. ఇది బ్లడ్‌ సర్క్యూలేషన్‌ను మెరుగు చేస్తుంది. అంతేకాదు శరీంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేస్తాయి. జీర్ణ ఆరోగ్యం..నానబెట్టిన బాదంలను తీసుకోవడం వ్లల పేగు ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీనివల్ల ఏవైనా కడుపుకు సంబంధిచిన సమస్యలు మీ దరిచేరవు మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.


చర్మ ఆరోగ్యాన్ని కూడా  మెరుగుచేస్తుంది..బాదంలలో విటమిన్‌ ఇ ఉంటుంది. ఇది ముఖంపై మచ్చలు గీతలు రాకుండా నివారిస్తుంది. బాదం తీసుకోవడం వల్ల మీ చర్మం మచ్చ లేకుండా, అందంగా మెరిసిపోతుంది. బాదంతో మీ చర్మంలో గ్లో కూడా వస్తుంది. మెదడు ఆరోగ్యం..బాదంలో రైబోఫ్లెవిన్, ఎల్ క్యర్నైట్‌ బాగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును కూడా మెరుగు చేస్తుంది. అంతేకాదు ఇది బ్రెయిన్‌ సంబంధిత సమస్యలు రాకుండా నియంత్రిస్తుంది. దీంతో అల్జీమర్స్ వంటి అనేక సమస్యలు రాకుండా కూడా ఉంటాయి.బరువు నిర్వహణ.. బాదంలో ఫైబర్‌ ఆరోగ్యకరమైన కొవ్వులు  ఉంటాయి. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు. బరువు కూడా పెరగరు. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌ చేసేవారు బాదంను డైట్లో చేర్చుకోవాలి. ఇది బరువు తగ్గడానికి ప్రయత్నం చేసే వారికి మంచిది. ఎక్కువఆహరం తినకుండా ఉంటారు. కాబట్టి బరువు సులభంగా తగ్గిపోతారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>