Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/not-instant-love-but-decently-passable91be64ef-c189-4cf7-a8a6-812d1dec3d04-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/not-instant-love-but-decently-passable91be64ef-c189-4cf7-a8a6-812d1dec3d04-415x250-IndiaHerald.jpgన్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు సూపర్ ఫాం లో ఉన్నాడు. మొన్నటిదాకా పక్కింటి కుర్రాడి ఇమేజ్ తో ఎమోషనల్ స్టోరీస్ చేసిన నాని ఇప్పుడు మాస్ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలో తను చేస్తున్న ప్రతి సినిమాలో కొద్ది కొద్దిగా మాస్ డోస్ పెంచుతూ ఆకట్టుకుంటున్నాడు. నాని లాంటి సాఫ్ట్ హీరో నుంచి దసరా లాంటి వైలెంట్ మూవీ వస్తుందని ఊహించిNani Saripoda Shanivaram{#}Nani;editor mohan;priyanka;s j surya;srikanth;surya sivakumar;vivek;Dussehra;Cinema;Audience;Saturday;Vijayadashami;Hero;Father;Massనాని కూడా టాప్ గేర్ వేశాడు..!నాని కూడా టాప్ గేర్ వేశాడు..!Nani Saripoda Shanivaram{#}Nani;editor mohan;priyanka;s j surya;srikanth;surya sivakumar;vivek;Dussehra;Cinema;Audience;Saturday;Vijayadashami;Hero;Father;MassMon, 22 Jul 2024 07:28:00 GMTన్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు సూపర్ ఫాం లో ఉన్నాడు. మొన్నటిదాకా పక్కింటి కుర్రాడి ఇమేజ్ తో ఎమోషనల్ స్టోరీస్ చేసిన నాని ఇప్పుడు మాస్ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలో తను చేస్తున్న ప్రతి సినిమాలో కొద్ది కొద్దిగా మాస్ డోస్ పెంచుతూ ఆకట్టుకుంటున్నాడు. నాని లాంటి సాఫ్ట్ హీరో నుంచి దసరా లాంటి వైలెంట్ మూవీ వస్తుందని ఊహించి ఉండరు. కానీ ఆడియన్స్ అంచనాలను దాటి నాని దసరా తో సూపర్ హిట్ అందుకున్నాడు.

ఆ తర్వాత మళ్లీ తన ఫార్మెట్ లో హాయ్ నాన్న చేసి మెప్పించాడు. ఇక ఇప్పుడు సరిపోదా శనివారం అంటూ వస్తున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఇదేదో నాని మార్క్ సాఫ్ట్ మూవీ అనిపిస్తున్నా లోపల మాస్ మాత్రం అంతే ఉందని తెలుస్తుంది. సరిపోదా శనివారం సినిమాలో నాని యాక్షన్ పార్ట్ కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాతో మరోసారి నాని మాస్ స్టామినా గురించి మాట్లాడుకునేలా చేయబోతున్నాడట.

నాని సరిపోదా శనివారం సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో విలన్ గా ఎస్ జె సూర్య చేస్తున్నారు. ఈమధ్యనే రిలీజైన టీజర్ చూస్తే సినిమాలో నానికి తగిన పాత్రలో ఎస్.జె సూర్య రోల్ ఉంటుందని అర్ధమవుతుంది. నాని సరిపోదా శనివారం సినిమా తో భారీ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. నానిమూవీ తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. ఈసారి దసరాని మించే సినిమా తో వాళ్లు రాబోతున్నట్టు తెలుస్తుంది. సినిమా బడ్జెట్ కూడా నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ పెట్టాలని ఫిక్స్ అయ్యారట.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>