HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips35d8a305-b64f-4a5d-93dd-b28f138bf139-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips35d8a305-b64f-4a5d-93dd-b28f138bf139-415x250-IndiaHerald.jpgభోజనం తర్వాత సోంపు తింటే కలిగే లాభాలెన్నో తెలుసా? భోజనం తర్వాత సోంపు తినాలని చాలా మంది అంటుంటారు. అసలు భోజనం చేసిన తర్వాత సోంపును తింటే ఏమౌతుంది? దీనివల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయో చాలా మందికి తెలియవు. నిజానికి భోజనం చేసిన తర్వాత సోంపును తినడం వల్ల మన జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. ఒక చెంచా సోంపులో మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు ఎన్నో ఉంటాయి. సోంపులో సోడియం,ఐరన్ కాల్షియం,పొటాషియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఈ సోంపు వాసన కూడా చాలా అద్బుతంగా ఉంటుంది. మీకు తెHealth Tips{#}Vitamin,Avunuభోజనం తర్వాత సోంపు తింటే కలిగే లాభాలెన్నో తెలుసా?భోజనం తర్వాత సోంపు తింటే కలిగే లాభాలెన్నో తెలుసా?Health Tips{#}Vitamin,AvunuMon, 22 Jul 2024 13:00:00 GMTభోజనం తర్వాత సోంపు తినాలని చాలా మంది అంటుంటారు. అసలు భోజనం చేసిన తర్వాత సోంపును తింటే ఏమౌతుంది? దీనివల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయో చాలా మందికి తెలియవు. నిజానికి భోజనం చేసిన తర్వాత సోంపును తినడం వల్ల మన జీర్ణశక్తి  పెరుగుతుంది. అలాగే నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. ఒక చెంచా సోంపులో మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు ఎన్నో ఉంటాయి. సోంపులో సోడియం,ఐరన్ కాల్షియం,పొటాషియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఈ సోంపు వాసన కూడా చాలా అద్బుతంగా ఉంటుంది. మీకు తెలుసా? సోంపును రోజూ తినడం వల్ల జీర్ణక్రియ, జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎలాంటి సమస్యలు రావు. కావాలనుకుంటే మీరు సోంపు వాటర్ ను కూడా తాగొచ్చు. అసలు భోజనం చేసిన తర్వాత సోంపును ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..  సోంపు ఒక మంచి మౌత్ ఫ్రెషనర్. దీన్ని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇంట్లోనే కాదు.. హోటల్ లో భోజనం చేసిన తర్వాత మనకి ఖచ్చితంగా సోంపును మన ముందు పెడతారు.భోజనం చేసిన తర్వాత మీరు సోంపును తింటే రాత్రిపూట నిద్ర  పడుతుంది అంట.నిద్రరావడం లేదు అనే సమస్యే ఉండదు. అవును రాత్రిపూట మీరు సోంపును తింటే రాత్రి బాగా నిద్రపడుతుంది.


అంతేకాకుండా సోంపును తింటే జుట్టు ఎక్కువగా రాలే ఒత్తిడి నుంచి కూడా తగ్గిస్తుంది. హెయిర్ ఫాల్ నుంచి బయటపడటానికి సోంపు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. సోంపు జ్ఞాపకశక్తిని బలంగా ఉంచడానికి, బ్రెయిన్ పవర్ ను మెరుగుపరిచడానికి బాగా సహాయపడుతుంది. మీకు మెమోరీ పవర్ తక్కువగా ఉంటే రోజూ  ఆహరం తీసుకున్న తర్వాత కొంచెం సోంపును తినండి. అలాగే సోంపు పీరియడ్స్ సమస్యలను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. సోంపు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. పరగడుపున మీరు సోంపును తింటే ఇది మీ రక్తాన్ని శుద్ధి  చేయడం లో బాగా సహాయపడుతుంది. అలాగే మీ చర్మం ఆరోగ్యంగా, సురక్షితంగా, కాంతివంతంగా కూడా ఉంటుంది. అలాగే నోటి దుర్వాసనను తగ్గించుకోవడానికి సోంపు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. నోటి దుర్వాసన తగ్గడానికి మీరు అర చెంచా సోపును రోజుకు మూడు లేదా నాలుగు సార్లు తింటే సరిపోతుంది.


ఇలా తినడం వల్ల నోటి దుర్వాసన నుంచి ఉపశమనం కలుగుతుంది. సోంపు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రోజు దీన్ని తింటే మీరు బరువు కూడా తగ్గుతారు. సోంపు మీరు బరువు ఎక్కువ పెరగకుండా కాపాడుతుంది. అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి సోంపును డయాబెటీస్ ఉన్నవారు కూడా తినొచ్చు. మీకు మలబద్దకం సమస్య ఉన్నట్టైతే రోజూ సోంపును తినండి. ఎందుకంటే ఇది మీ జీర్ణక్రియను, సురక్షితంగా ఉంచడానికి మెరుగుపరుస్తుంది. అలాగే పొట్టను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. సోంపులో విటమిన్ ఎ పుష్కళంగా ఉంటుంది. ఇది మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. సోంపును తినడం అలవాటు చేసుకుంటే సోంపు తినడం వల్ల కంటిశుక్లం, ఇతర కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉండదు. సోపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన చర్మాన్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే మన చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేసి అందంగా, మెరిసేలా కనిపించేలా చేస్తుంది. అలాగే సోంపు శక్తివంతమైన యాంటీ-అలెర్జిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది యాంటీ-అలెర్జిక్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది. అలాగే ఇది కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇది పాలు ఇచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>