PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/maharastra6105fd3b-d601-4c18-99e3-38a6d0566b00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/maharastra6105fd3b-d601-4c18-99e3-38a6d0566b00-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అలాంటి రాష్ట్రాలలో... మహారాష్ట్ర ఒకటి. అతి త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న.. ఉప ఎన్నికలను కూడా నిర్వహించనుంది. maharastra{#}Parliment;september;Survey;October;Maha;central government;sam;Samantha;Sam Mendes;Bharatiya Janata Party;Congress;Maharashtra;News;Assemblyమహారాష్ట్ర సర్వే: బీజేపీకి ఎదురుదెబ్బ..చక్రం తిప్పనున్న ఎన్సీపీ ?మహారాష్ట్ర సర్వే: బీజేపీకి ఎదురుదెబ్బ..చక్రం తిప్పనున్న ఎన్సీపీ ?maharastra{#}Parliment;september;Survey;October;Maha;central government;sam;Samantha;Sam Mendes;Bharatiya Janata Party;Congress;Maharashtra;News;AssemblyMon, 22 Jul 2024 08:51:00 GMTమొన్నటి వరకు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అలాంటి రాష్ట్రాలలో... మహారాష్ట్ర ఒకటి. అతి త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న.. ఉప ఎన్నికలను కూడా నిర్వహించనుంది.

అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల.. హడావిడి నేపథ్యంలో ఇప్పటినుంచే... అన్ని పార్టీలు ప్రచారానికి ముందుకు వస్తున్నాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో.. మహారాష్ట్ర ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. ఇలాంటి నేపథ్యంలో మహా రాష్ట్ర ఎన్నికలపై.. తాజాగా ఓ సర్వే రిపోర్ట్ బయటికి వచ్చింది. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం బిజెపికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.


మహా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సకల్ సామ్  అనే సర్వే సంస్థ  తమ రిపోర్టును బయటపెట్టింది. వాస్తవానికి మహారాష్ట్ర 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఎన్డీఏ కూటమికి 136 స్థానాలు వస్తాయని... కాంగ్రెస్ కూటమికి.... 152 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది. అంటే..మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్..శివసేన మరియు ఎన్సిపి కలయిక అధికారంలోకి రాబోతుందన్నమాట. అయితే...

మహా రాష్ట్ర లో బిజెపికి సొంతంగా 95 స్థానాలు... రావడమే కాకుండా పెద్ద పార్టీగా అవతరించబోతుందని ప్రకటించింది ఈ సర్వే సంస్థ. అటు కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు వస్తాయని, ఎన్సిపికి 41 శివసేనకు 31 స్థానాలు వస్తాయని వెల్లడించింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో... మహారాష్ట్ర ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అలాగే ఏక్ నాథ్ షిండే వ్యవహారం నేపథ్యంలో కూడా.... బిజెపి పార్టీ పట్ల మహా రాష్ట్ర ప్రజలు విసిగిపోయినట్లు సమాచారం. మరి ఈ సర్వే రిపోర్టు నేపథ్యంలో బీజేపీ పార్టీ.. ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకెళుతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>