PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-ys-jagan-apex-cm-jagan-ysrcp-politics-mla-jagan-reddy4407dfef-9cd0-4396-bace-6f3834370209-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-ys-jagan-apex-cm-jagan-ysrcp-politics-mla-jagan-reddy4407dfef-9cd0-4396-bace-6f3834370209-415x250-IndiaHerald.jpgఏపీలో గత ఎన్నికలలో ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజుకు ఒక ఇబ్బంది వచ్చి పడుతోంది. ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి తన చుట్టూ ఒక మాయ ప్రపంచం ఏర్పాటు చేసుకొని.. ఆ మాయా ప్రపంచంలో కలల లోకంలో విహరిస్తూ తాము ఏమనుకుంటున్నారో బయట కూడా అదే జరుగుతుందని బతికేస్తూ వచ్చారు. వాస్తవంలోకి రావాలని సొంత పార్టీ నేతలు చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ఓడిపోయిన తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డికి అసలు నిజం ఏంటన్నది తెలియలేదు. అసలు నిజం తెలిసినా.. దానికి అనుగుణంగా రాజకీయం ప్రారంభిస్తారని అనుYsrcp; ys Jagan; Apex CM Jagan; ysrcp politics; MLA Jagan Reddy{#}Y. S. Rajasekhara Reddy;Nijam;central government;Yevaru;politics;Bharatiya Janata Party;maya;Andhra Pradesh;Party;Assembly;Jaganవైసీపీ ఫేడ‌వుట్ రాజ‌కీయం... 2029లో ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే..?వైసీపీ ఫేడ‌వుట్ రాజ‌కీయం... 2029లో ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే..?Ysrcp; ys Jagan; Apex CM Jagan; ysrcp politics; MLA Jagan Reddy{#}Y. S. Rajasekhara Reddy;Nijam;central government;Yevaru;politics;Bharatiya Janata Party;maya;Andhra Pradesh;Party;Assembly;JaganSun, 21 Jul 2024 13:15:00 GMTఏపీలో గత ఎన్నికలలో ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజుకు ఒక ఇబ్బంది వచ్చి పడుతోంది. ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి తన చుట్టూ ఒక మాయ ప్రపంచం ఏర్పాటు చేసుకొని.. ఆ మాయా ప్రపంచంలో కలల లోకంలో విహరిస్తూ తాము ఏమనుకుంటున్నారో బయట కూడా అదే జరుగుతుందని బతికేస్తూ వచ్చారు. వాస్తవంలోకి రావాలని సొంత పార్టీ నేతలు చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ఓడిపోయిన తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డికి అసలు నిజం ఏంటన్నది తెలియలేదు. అసలు నిజం తెలిసినా.. దానికి అనుగుణంగా రాజకీయం ప్రారంభిస్తారని అనుకుంటే.. జగన్ మాత్రం తనకు అలవాటైన కంఫర్ట్ జోన్‌లో ఉండిపోయి.. జనంతో సంబంధం లేని రాజకీయాలు చేస్తూ ఇంకా ఇంకా దిగజారిపోతున్న పరిస్థితి.


దీనికి తాజా ఉదాహరణ ఢిల్లీలో ధర్నా ఆలోచన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు.. ఈనెల 22 నుంచి ప్రారంభమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టడానికి జగన్ ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నారు. నిజంగా ఢిల్లీలో ధర్నా చేస్తే ఎవరు పట్టించుకోరు అన్న సంగతి తర్వాత చర్చించుకుందాం. అసలు అసెంబ్లీని ఎగ్గొట్టడానికి దొరికిపోయేలా ఈ డేట్ ఖరారు చేసుకోవటమే జగన్ అమాయకత్వానికి పెద్ద నిదర్శనం అని చెప్పాలి. వాస్తవానికి అసెంబ్లీలో పోరాటం చేయడం ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిన పని.. అది చట్టసభ ఏం చేసినా అక్కడే చేయాలి. కానీ అక్కడ నుంచి పారిపోయి ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పటంలోనే పెద్దతప్పిదం ఉంది.


ఆ మాటకు వస్తే జగన్ ప్రతిపక్షంలో ఉంటే అసెంబ్లీకి వచ్చేందుకు ఎంత మాత్రం ఇష్టపడరు. 2014లో పార్టీ ఓడిపోయినప్పుడు చివరి రెండేళ్లు జగన్ అసెంబ్లీ ఎగ్గొట్టారు. ఇక ఇప్పుడు అసెంబ్లీలో చర్చించాల్సింది పోయి.. ఢిల్లీలో ధర్నా చేస్తే ఎవరు ? పట్టించుకుంటారు.. ఓ రాష్ట్ర శాంతిభద్రతల అంశంపై ఆ రాష్ట్ర విపక్షం.. ఆ రాష్ట్రంలోనే తేల్చుకోవాలి. ఢిల్లీలో ధర్నా చేస్తే ఉపయోగం ఉండదు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలపై మాత్రమే ఢిల్లీలో ధర్నా చేస్తే ఉపయోగముంటుంది. ఏపీలో లాండ్ ఆర్డర్‌లో కేంద్రం ఏం చేస్తుంది. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. అలాంటప్పుడు జగన్ ఢిల్లీలో ధర్నా చేయడం పెద్ద మూర్ఖత్వ ఆలోచన అనుకోవాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>