EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddy4ab09a41-6dfb-4455-8ec9-ec51830a397c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddy4ab09a41-6dfb-4455-8ec9-ec51830a397c-415x250-IndiaHerald.jpgకమ్మ అంటే అమ్మలాంటి వారు. అమ్మ బిడ్డ కడుపు చూస్తుంది. కమ్మవారి వ్యవసాయం పది మందికి అన్నం పెడుతుంది. వారు కష్టపడి పంటలు పండించాలని, పదిమందికి ఉపయోగపడాలని అనుకుంటారు. నేను ఎక్కడ ఉన్నా.. వారు నన్ను ఎంతగానో ఆదరిస్తారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అవును మాదాపూర్ లో నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహా సభల్లో తెలంగాణ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన పదిమందిని ఆదుకోవాలని ఆలోచన కమ్మవారు చేస్తారని.. అమరావతి నుంచి సిలికాన్ ర్యాలీ వరకు వాళ్లు విస్తరించారని.. ఎrevanth reddy{#}vishwa;Kamma;Avunu;revanth;NTR;Hyderabad;Telangana;politics;Telugu;Amaravati;CM;Mahaకమ్మ కులంపై రేవంత్‌ రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌?కమ్మ కులంపై రేవంత్‌ రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌?revanth reddy{#}vishwa;Kamma;Avunu;revanth;NTR;Hyderabad;Telangana;politics;Telugu;Amaravati;CM;MahaSun, 21 Jul 2024 08:52:00 GMTకమ్మ అంటే అమ్మలాంటి వారు. అమ్మ బిడ్డ కడుపు చూస్తుంది. కమ్మవారి వ్యవసాయం పది మందికి అన్నం పెడుతుంది. వారు కష్టపడి పంటలు పండించాలని, పదిమందికి ఉపయోగపడాలని అనుకుంటారు. నేను ఎక్కడ ఉన్నా.. వారు నన్ను ఎంతగానో ఆదరిస్తారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.


అవును మాదాపూర్ లో నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహా సభల్లో తెలంగాణ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన పదిమందిని ఆదుకోవాలని ఆలోచన కమ్మవారు చేస్తారని.. అమరావతి నుంచి సిలికాన్ ర్యాలీ వరకు వాళ్లు విస్తరించారని.. ఎన్నో కంపెనీలకు అధిపతులుగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎక్కడ సారవంతమైన నేల ఉంటే అక్కడ కమ్మవారు కనిపిస్తారని అన్నారు. నేలను నమ్ముకొని కష్టపడి పని చేస్తారని కొనియాడారు.


ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమ్మ కుటుంబ సభ్యులను ఒక దగ్గర చేర్చడం అభినందనీయమన్నారు. వాస్తవానికి 2023 కి ముందే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పినట్లు రేవంత్ తెలిపారు. అయితే ఎన్నికలు,  ఇతర పలు కారణాల వల్ల అది సాధ్యం కాలేదు అన్నారు. 90 రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని కార్యక్రమం ఘనంగా నిర్వహించారని సీఎం వివరించారు.


ఈ సందర్భంగా విశ్వ విఖ్యాత నట సౌర్యభౌమ నందమూరి తారక రామారావు ప్రస్థావన తెచ్చిన రేవంత్.. ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్టీఆర్ నుంచి తాను నేర్చుకున్న విషయాలను వెల్లడించారు. ఇందులో  భాగంగా ఎన్టీఆర్ గ్రంథాలయంలో చదివిన చదువు మమ్మల్ని ఉన్నత స్థానాలకు చేర్చిందని అన్నారు.


ఇదే క్రమంలో రాజకీయంలోనూ.. నాయకత్వంలోను ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్ అని.. ఆయన తెచ్చిన సంకీర్ణ రాజకీయాలు నేడు దేశాన్ని ఏలుతున్నాయని తెలిపారు. అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి నాయకులు ఉన్నారంటే దానికి కారణం ఆ రోజు ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాలే అని కొనియాడారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చే ప్రణాళికలో మీరు భాగస్వాములు కావాలని కోరిన రేవంత్.. మీలోని ప్రతిభను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందన్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>