MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jagan23befb2e-477b-4eb8-b4f3-58d70d84280a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jagan23befb2e-477b-4eb8-b4f3-58d70d84280a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 22 వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వై సీ పీ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు వచ్చి కొంత సమయం మాత్రమే అసెంబ్లీలో గడిపాడు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. ఇక ఈ దఫా అసెంబ్లీ సమావేశాలలో కూడా ఈయన హాజరు అవుతాడా లేదా అనే ప్రశ్నలు జనాలు రేకెత్తాయి. కాకపోతే ఈయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నట్లు వై jagan{#}war;Party;Telugu Desam Party;Reddy;Government;Jagan;Andhra Pradesh;Assemblyఅసెంబ్లీలో జగన్ కి ఆ అవకాశం దక్కేనా.. కూటమి వలకు చిక్కేనా..?అసెంబ్లీలో జగన్ కి ఆ అవకాశం దక్కేనా.. కూటమి వలకు చిక్కేనా..?jagan{#}war;Party;Telugu Desam Party;Reddy;Government;Jagan;Andhra Pradesh;AssemblySun, 21 Jul 2024 06:19:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 22 వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వై సీ పీ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు వచ్చి కొంత సమయం మాత్రమే అసెంబ్లీలో గడిపాడు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. ఇక ఈ దఫా అసెంబ్లీ సమావేశాలలో కూడా ఈయన హాజరు అవుతాడా లేదా అనే ప్రశ్నలు జనాలు రేకెత్తాయి.

కాకపోతే ఈయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నట్లు వై సి పి వర్గాలు చెబుతూ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సారి వై సీ పీ పార్టీ నుండి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. అందులో కూడా అద్భుతమైన వాడి వేడి ప్రసంగం ఇచ్చేవారు ఎవరూ లేరు. దానితో జగన్ ఒంటరిగా ప్రతి పక్షాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇక తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చాక వై సి పి పార్టీపై కొన్ని ప్రాంతాలలో దాడులు జరిగాయి. వాటిని గురించి జగన్ గట్టిగా మాట్లాడాలి అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరి వై సి పి పార్టీ కి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. దానితో ఈయనకు మైక్ ఎక్కువ సేపు అందుతుందా అనేది కూడా ప్రశ్నగా మారుతుంది. ఇక కేవలం వై సి పి సభ్యులు 11 మంది ఉన్నారు. కూటమి నుండి హాల్ అంతా నిండిపోయి ఉంటుంది. వారు జగన్ ను కట్టు దిట్టం చేసి మాటలా యుద్ధం చేసే అవకాశం కూడా ఉంది. ఆ వలకు చిక్కకుండా జగన్ వారి ఎత్తుగడలను చెత్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కూటమి వ్యూహాలను తట్టుకొని జగన్ ఏ స్థాయిలో తన ప్రసంగంతో జనాలను ఆకట్టుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>