MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sudheer-babua983185a-e96b-4529-9509-78d7d06db982-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/sudheer-babua983185a-e96b-4529-9509-78d7d06db982-415x250-IndiaHerald.jpgసుధీర్ బాబు ఫిట్నెస్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే? సూపర్ స్టార్ మహేష్ బాబు బామ్మర్ది, సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు అనే బ్రాండ్ తోనే టాలీవుడ్ లోకి సుధీర్ బాబు ఎంట్రీ ఇచ్చాడు. హిట్లు తక్కువే అయినా నటుడిగా మాత్రం తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నాడు. అలాగే అందమైన హీరోగా కూడా పేరు సంపాదించాడు. కండలు తిరిగిన శరీరంతో అదిరిపోయే లుక్ లో కనిపించే సుధీర్ బాబుకి తనని తాను పూర్తిస్థాయిలో షోకేస్ చేసుకునే క్యారెక్టర్ పడలేదని ఘట్టమనేని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.అయితే కెరియర్ ఆరంభం నుంచి డిఫరెంట్ కథలని ట్రైSudheer Babu{#}sudheer babu;sudigali sudheer;venkat;Thriller;Fighter;krishna;mahesh babu;Genre;Success;Audience;News;India;Cinema;Tollywood;bollywoodసుధీర్ బాబు ఫిట్నెస్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే?సుధీర్ బాబు ఫిట్నెస్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే?Sudheer Babu{#}sudheer babu;sudigali sudheer;venkat;Thriller;Fighter;krishna;mahesh babu;Genre;Success;Audience;News;India;Cinema;Tollywood;bollywoodSun, 21 Jul 2024 15:14:00 GMT సూపర్ స్టార్ మహేష్ బాబు బామ్మర్ది, సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు అనే బ్రాండ్ తోనే టాలీవుడ్ లోకి సుధీర్ బాబు ఎంట్రీ ఇచ్చాడు. హిట్లు తక్కువే అయినా నటుడిగా మాత్రం తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నాడు. అలాగే అందమైన హీరోగా కూడా పేరు సంపాదించాడు. కండలు తిరిగిన శరీరంతో అదిరిపోయే లుక్ లో కనిపించే సుధీర్ బాబుకి తనని తాను పూర్తిస్థాయిలో షోకేస్ చేసుకునే క్యారెక్టర్ పడలేదని ఘట్టమనేని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.అయితే కెరియర్ ఆరంభం నుంచి డిఫరెంట్ కథలని ట్రై చేస్తూ ఉండటం వలన సుధీర్ బాబుకి కమర్షియల్ గా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ అయితే పడలేదు. అయితే రీసెంట్ గా హరోంహర సినిమాతో సుధీర్ బాబు ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో ఈ మూవీని ఎక్కువ మంది ఆడియన్స్ చూస్తున్నారు. పీరియాడిక్ జోనర్ లో పవర్ ఫుల్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా చేశారు.ఈ మూవీలో సుదీర్ బాబు పెర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది. కమర్షియల్ గా థియేటర్స్ లో ఈ సినిమా యావరేజ్ సక్సెస్ అందుకుంది. ఇక ఇదిలా ఉంటే సుధీర్ బాబు తన నెక్స్ట్ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేయబోతున్నాడు. అది కూడా కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కనుంది. 


ప్రస్తుతం ఈ సినిమా కోసం సుధీర్ బాబు జిమ్ లో కష్టపడుతూ కసరత్తులు చేస్తున్నారంట. సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతోందంట. ఈ మూవీలో సుధీర్ బాబు క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. అందుకే క్యారెక్టర్ పెర్ఫెక్షన్ కోసం లుక్ పరంగా వేరియేషన్ చూపించే ప్రయత్నం సుధీర్ బాబు చేస్తున్నారు. అసలే కండలు తిరిగిన శరీరంతో సూపర్ ఫిట్ గా సుధీర్ బాబు ఉంటాడు. ఇప్పుడు ఆ కండలు మరింతగా పెంచి ఫైటర్ తరహాలో సిద్ధం అవుతూ ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఆయన వర్క్ అవుట్ కి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ మూవీతో వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయంట. పౌరాణిక కథల రిఫరెన్స్ తోనే ఈ మూవీని వెంకట్ కళ్యాణ్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. మంచికి చెడుకి మధ్య జరిగే యుద్ధంగా ఈ సినిమా కథాంశం ఉంటుందంట. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్ ని సుధీర్ బాబుకి జోడీగా ఈ సినిమా కోసం ఎంపిక చేయబోతున్నారంట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>