MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/------0fb67956-249f-4420-878c-7ef9d5abb62e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/------0fb67956-249f-4420-878c-7ef9d5abb62e-415x250-IndiaHerald.jpgబుట్ట బొమ్మ పూజా హెగ్దే గురించి తెలుగు కుర్రాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎలాంటి పాత్ర అయినా పూజా బేబీ చేసే బ్యూటీ షోకి కుర్రాళ్లకు మతి పోవాల్సిందే. ఆమె తెలుగులో చేసిన ఫస్ట్ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయినా అల్లు అర్జున్ తో చేసిన దువ్వాడ జగన్నాథంతో అమ్మడు ఊపందుకుంది. ఇక ఆ సినిమా తరువాత అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అప్పటి నుంచి మొన్నటి రాధేశ్యాం వరకు వరుసగా స్టార్ సినిమాల్లో నటిస్తూ సత్తా చాటింది. ఐతే రాధే శ్యాం ప్లాఫ్ కావడంతో అమ్మడి కెరీర్ మీద ఎఫెక్ట్ పడపూజా హెగ్దే{#}Chaitanya;Oka Laila Kosam;naga;Air;Allu Arjun;Naga Chaitanya;Tamil;Pooja Hegde;Telugu;Director;surya sivakumar;BEAUTY;Cinemaప్రాజెక్ట్ మొదలయ్యే దాకా ఆమెకి పడిగాపులు తప్పవా?ప్రాజెక్ట్ మొదలయ్యే దాకా ఆమెకి పడిగాపులు తప్పవా?పూజా హెగ్దే{#}Chaitanya;Oka Laila Kosam;naga;Air;Allu Arjun;Naga Chaitanya;Tamil;Pooja Hegde;Telugu;Director;surya sivakumar;BEAUTY;CinemaSun, 21 Jul 2024 14:49:00 GMTబుట్ట బొమ్మ పూజా హెగ్దే గురించి తెలుగు కుర్రాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఎలాంటి పాత్ర అయినా పూజా బేబీ చేసే బ్యూటీ షోకి కుర్రాళ్లకు మతి పోవాల్సిందే. ఆమె తెలుగులో చేసిన ఫస్ట్ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయినా అల్లు అర్జున్ తో చేసిన దువ్వాడ జగన్నాథంతో అమ్మడు ఊపందుకుంది. ఇక ఆ సినిమా తరువాత అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అప్పటి నుంచి మొన్నటి రాధేశ్యాం వరకు వరుసగా స్టార్ సినిమాల్లో నటిస్తూ సత్తా చాటింది. ఐతే రాధే శ్యాం ప్లాఫ్ కావడంతో అమ్మడి కెరీర్ మీద ఎఫెక్ట్ పడింది అని చెప్పుకోవచ్చు. మరోవైపు తమిళ్ లో కూడా అమ్మడికి చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోవడంతో పూజాకి ఆఫర్లు కరువయ్యాయి.

ఈ నేపథ్యంలో పేరు వచ్చిన చోటే మరలా మరో చాన్సు కోసం అమ్మడు పడిగాపులు కాస్తోంది అని సమాచారం. అవును, తెలుగులో ఛాన్స్ వస్తే మళ్లీ తన టాలెంట్ చూపించాలని చూస్తుంది పూజా హెగ్దే. ఈ క్రమంలో ఓ వార్త ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్యతో విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు చేస్తున్న సినిమాలో పూజా హెగ్దే నటిస్తుందని టాక్ వినబడుతోంది. పూజాతో ఒక లైలా కోసం సినిమా చేసిన నాగ చైతన్య మళ్లీ ఇన్నాళ్లకు ఆమెతో జత కడుతున్నాడన్నమాట. ఐతే పూజాకి నిజంగానే ఆ సినిమా ఆఫర్ వచ్చిందా? లేక ఇది కూడా అన్ని సినిమాల్లానే ఒక గాలి వార్తా? అన్నది అయితే ఇంకా తెలియాల్సి ఉంది.

అందుకే చైతన్య సినిమా మొదలయ్యే దాకా పూజాసినిమా చేస్తుందో లేదో అన్నది చెప్పడం ఒకింత కష్టం. అయితే ఈ విషయం ఆమె దగ్గరికి వెళ్లగా... అలాంటి కాల్స్ తనకి రాలేదని, వస్తే తనకంటే సంతోషించేవారు ఇక ఉండరని తన సన్నిహితుల దగ్గర చెప్పిందంట. ఏదేమైనా ఈసారి ఆమెకి ఛాన్స్ వస్తే మాత్రం అటు యాక్టింగ్ తోనే కాదు గ్లామర్ షోతో పూజా బేబీ తెలుగు కుర్రాళ్ళకి మంచి షో చూపనుందట. ఇక ఈ మధ్యనే సూర్య 44వ సినిమాలో ఛాన్స్ అందుకుంది పూజా హెగ్దే. దీనితో పాటు హిందీలో కూడా ఒక సినిమా చేస్తుంది. తెలుగులో తిరిగి పూజా ఫాం లోకి వస్తే మాత్రం అమ్మడి ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. అందుకే ఆమె మరీ ముఖ్యంగా తెలుగు సినిమా కోసమే పడిగాపులు కాస్తోందని గుసగుసలు వినబడుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>