PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-ysrcp-vijay-sai-reddy-beda-mastan-rao-mp-niranjen-reddy-86ffab4c-a190-46ff-b98b-031f6f9bb4ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-ysrcp-vijay-sai-reddy-beda-mastan-rao-mp-niranjen-reddy-86ffab4c-a190-46ff-b98b-031f6f9bb4ba-415x250-IndiaHerald.jpgసీఎంగా ఉన్న ఐదు సంవత్సరాలలో జగన్ అసలు తమ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు కదా.. మంత్రులను కలిసేందుకు కూడా పెద్దగా ఇష్టపడలేదు. ఒకవేళ మంత్రివర్గ సమావేశం జరిగిన అది పూర్తి డమ్మీగా జరిగేది. అందులో మంత్రుల అభిప్రాయాలకు, స్వేచ్ఛకు అస్సలు విలువ ఉండేది కాదు. ఇక జగన్ సీఎం గా ఉన్నప్పుడు అస్సలు పార్లమెంటరీ పార్టీ భేటీలు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. భేటీకి వచ్చే నిధులు అడుగుతారని భయము లేదా.. ఇతర సమస్యల గురించి ప్రశ్నిస్తారని పెద్దగా కలిసేవారు కాదు. ఎవరైనా ఎంపీ.. ఏదైనా సమస్య గురించి ప్రస్తావిస్తే ys jagan; ysrcp; Vijay Sai Reddy; beda Mastan Rao;mp niranjen reddy {#}VijayaSaiReddy;Rajya Sabha;MP;Saturday;Manam;Andhra Pradesh;Party;Jagan;TDP;YCPజ‌గ‌న్ పిలిస్తే వెళ్లాలా.. ఐదుగురు ఎంపీల ఆన్స‌ర్ ఇది...!జ‌గ‌న్ పిలిస్తే వెళ్లాలా.. ఐదుగురు ఎంపీల ఆన్స‌ర్ ఇది...!ys jagan; ysrcp; Vijay Sai Reddy; beda Mastan Rao;mp niranjen reddy {#}VijayaSaiReddy;Rajya Sabha;MP;Saturday;Manam;Andhra Pradesh;Party;Jagan;TDP;YCPSun, 21 Jul 2024 13:20:24 GMTసీఎంగా ఉన్న ఐదు సంవత్సరాలలో జగన్ అసలు తమ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు కదా.. మంత్రులను కలిసేందుకు కూడా పెద్దగా ఇష్టపడలేదు. ఒకవేళ మంత్రివర్గ సమావేశం జరిగిన అది పూర్తి డమ్మీగా జరిగేది. అందులో మంత్రుల అభిప్రాయాలకు, స్వేచ్ఛకు అస్సలు విలువ ఉండేది కాదు. ఇక జగన్ సీఎం గా ఉన్నప్పుడు అస్సలు పార్లమెంటరీ పార్టీ భేటీలు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. భేటీకి వచ్చే నిధులు అడుగుతారని భయము లేదా.. ఇతర సమస్యల గురించి ప్రశ్నిస్తారని పెద్దగా కలిసేవారు కాదు. ఎవరైనా ఎంపీ.. ఏదైనా సమస్య గురించి ప్రస్తావిస్తే అది మీకు ఎందుకు..? మంత్రులు ఎమ్మెల్యేలు చూసుకుంటారు కదా.. అని పంపేసేవారు.


కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మిగిలిన ఎంపీలని పార్లమెంటరీ పార్టీలకు పిలుస్తున్నారు. అయితే శనివారం నిర్వహించిన సమావేశానికి ఐదుగురు ఎంపీలు హాజరు కాలేదు. అధికారంలో ఉన్నన్ని రోజులు జగన్ మనలను పట్టించుకోలేదు.. ఇప్పుడు ఆయన పిలిస్తే మనం హాజరు కావలసిన అవసరం లేదని వారు అనుకున్నట్టు ఉంది. విజయ సాయి రెడ్డి సమావేశానికి గైరు హాజరయ్యారు. వైసీపీకి మొత్తంగా 15 మంది ఎంపీలు ఉన్నారు. 11 మంది రాజ్యసభ సభ్యులు.. నలుగురు లోక్సభ ఎంపీలు ఉన్నారు. రాజ్యసభ సభ్యులో స‌భ్యుడిగా ఉన్న ప‌రిమ‌ళ్ న‌త్వాని అస్స‌లు ఏపీ వైపు రారు. ఆయన వైసీపీ సభ్యుడు మాత్రమే కానీ.. ఆ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవు.


ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదు కాబట్టి అస్సలు అవకాశాలు లేవు. ఇక నిరంజన్ రెడ్డికి కేవలం లాయర్ ఫీజు కోసమే రాజ్యసభ పదవి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇక మరి కొంతమంది ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ లిస్టులో ఏకంగా విజయసాయిరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇక టీడీపీ నుంచి గతంలో వైసీపీలోకి వెళ్లిన మరో రాజ్యసభ సభ్యులు.. బీద మస్తాన్‌రావు తిరిగి టీడీపీ గూటికి చేరే ప్రయత్నంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంకా మరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలపై కూడా వైసీపీ వాళ్లకే సందేహాలు ఉన్నాయి. ఇక తాజా సమావేశంలో ఢిల్లీలో ధర్నా గురించి జగన్ ఎక్కువగా ఎంపీలతో మాట్లాడారు. కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకొని ధర్నా చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>