LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/divorce--most-of-the-reasons-for-divorce--india-love27852501-4bb7-420d-bdbb-72d3504f7ca9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/divorce--most-of-the-reasons-for-divorce--india-love27852501-4bb7-420d-bdbb-72d3504f7ca9-415x250-IndiaHerald.jpgఇండియాలో విడాకులకు ఎక్కువ శాతం కారణాలు ఇవే..! ఇండియాలో వివాహాలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. సాంప్రదాయంగా జరుగుతున్న విషయం కూడా తెలిసిందే. టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన భాగస్వామి నటాషా కు విడాకులు ప్రకటించాడు. వీరిద్దరికీ 2020 మేలో వివాహం జరిగింది. పెళ్లి అయినా నాలుగేళ్లలోనే వీరు విడాకుల బాట పట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత తరంలో విడాకులకు గల ప్రధాన కారణాలు గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి చాలా పెరిగిపోయింది. ఈ ఒత్తిడిని భాగస్వామిపై చూపడం, వారిపై అరవటంdivorce ; Most of the reasons for divorce ; India; love{#}2020;Ee Rojullo;Nataša Stanković;natasha;Hardik Pandya;marriage;jeevitha rajaseskhar;Indiaఇండియాలో విడాకులకు ఎక్కువ శాతం కారణాలు ఇవే..!ఇండియాలో విడాకులకు ఎక్కువ శాతం కారణాలు ఇవే..!divorce ; Most of the reasons for divorce ; India; love{#}2020;Ee Rojullo;Nataša Stanković;natasha;Hardik Pandya;marriage;jeevitha rajaseskhar;IndiaSun, 21 Jul 2024 18:40:00 GMTఇండియాలో వివాహాలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. సాంప్రదాయంగా జరుగుతున్న విషయం కూడా తెలిసిందే. టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన భాగస్వామి నటాషా కు విడాకులు ప్రకటించాడు. వీరిద్దరికీ 2020 మేలో వివాహం జరిగింది. పెళ్లి అయినా నాలుగేళ్లలోనే వీరు విడాకుల బాట పట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత తరంలో విడాకులకు గల ప్రధాన కారణాలు గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి చాలా పెరిగిపోయింది. ఈ ఒత్తిడిని భాగస్వామిపై చూపడం, వారిపై అరవటం వల్ల కూడా అది విడాకులకు దారి తీసే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య విడాకులకు కారణమయ్యే మరో ప్రధానమైన కారణం సెక్సువల్ లైఫ్. జీవిత భాగస్వామితో శృంగార జీవితం సుఖవంతంగా లేకపోతే అది వివాదాలకు దారితీస్తుంది. వేరొకరితో శారీరక బంధాలు కూడా ప్రమాదమే. మితిమీరిన కోపం, అహంకారం వివాహ బంధాన్ని నాశనం చేస్తాయి.


ఇలాంటి వారి వైవాహిక జీవితంలో తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఇది కూడా విడాకులకు దారి తీసే అవకాశం ఉంది. భార్యాభర్తలు గొడవ పడటం సాధారణమే..అయితే చిన్న చిన్న విషయాలకు తరచూ గొడవలు పడుతూ ఉంటే అది విడాకులకు దారి తీసే ప్రమాదం ఉంది. మీరు తరచూ గొడవ పడుతున్నారంటే ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడంలో ఎక్కడో లోపం ఉందని తెలుసుకోవాలి. మీ పని, ఆఫిస్ తో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయించడం చాలా అవసరం. కొంత సమయం జీవిత భాగస్వామితో గడపాల్సిందే. వారితో కలిసి మాట్లాడటం, సరదాగా బయటకు వెళ్లడం చేయాలి. లేదంటే ఒంటరితనంగా ఫీలయ్యే  అవకాశం ఉంది. ఇది విడాకులకు దారితీస్తుంది.


అనుమానం పెనుభూతం అని అంటారు. భాగస్వామి పై అనుమానం ఉంటే వెంటనే వారితో మాట్లాడి అసలు విషయం తెలుసుకోవాలి. అనుమానంతో భాగస్వామిని తరచూ ఇబ్బంది పెడితే ఇది విడాకులకు దారి తీసే ప్రమాదం ఉంది. భార్యాభర్తలు ప్రతి చిన్న విషయం గురించి చర్చించుకోవాలి. వేరే వాళ్ళు ఆ విషయం చెప్పేదాకా తీసుకురావద్దు. ఇలా చేస్తే నమ్మకం సన్నగిల్లి విడాకులకు దారి తీసే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో ఆర్థిక సమస్యల కారణంగా విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. సంపాదన కంటే ఖర్చు ఎక్కువగా ఉండటం, దీనివల్ల అప్పుల పాలవటం కూడా విడాకులకు దారితీస్తుంది. కొందరు మితిమీరిన డబ్బు ఆశతో భార్య, భర్తను దూరం చేసుకునేవారు లేకపోలేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>