PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం తిరుగులేని విజయం సాధించి ఏకంగా 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమి ఏర్పాటలో కీలకపాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వాస్తవంగా జనసేనకు చంద్రబాబు 24 ఎమ్మెల్యే .. మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు. అయితే కూటమి లోకి బిజెపి కూడా వచ్చి చేరడంతో వారికోసం పవన్ కళ్యాణ్ మూడు అసెంబ్లీ సీట్లతో పాటు అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని సైతం త్యాగం చేశారు. మూడు పార్టీల కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ ఎంత కీలకపాత్ర పోషించారు ... కూటమి ఘనవిజయం సాధించడంలోనూ పవన్ Janasena; cabinet buth; Lokesh; Pawan Kalyan; Chandrababu; nadella Manohar{#}ramesh babu;Nadendla Manohar;Anakapalle;Mandali Buddha Prasad;Deputy Chief Minister;Backward Classes;Janasena;MP;Bharatiya Janata Party;kalyan;Cabinet;MLA;Minister;Government;Assembly;CBNబాబు కేబినెట్‌.. జ‌న‌సేన కొత్త డిమాండ్ చూశారా.. ?బాబు కేబినెట్‌.. జ‌న‌సేన కొత్త డిమాండ్ చూశారా.. ?Janasena; cabinet buth; Lokesh; Pawan Kalyan; Chandrababu; nadella Manohar{#}ramesh babu;Nadendla Manohar;Anakapalle;Mandali Buddha Prasad;Deputy Chief Minister;Backward Classes;Janasena;MP;Bharatiya Janata Party;kalyan;Cabinet;MLA;Minister;Government;Assembly;CBNSun, 21 Jul 2024 13:35:41 GMTఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం తిరుగులేని విజయం సాధించి ఏకంగా 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమి ఏర్పాటలో కీలకపాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వాస్తవంగా జనసేనకు చంద్రబాబు 24 ఎమ్మెల్యే .. మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు. అయితే కూటమి లోకి బిజెపి కూడా వచ్చి చేరడంతో వారికోసం పవన్ కళ్యాణ్ మూడు అసెంబ్లీ సీట్లతో పాటు అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని సైతం త్యాగం చేశారు. మూడు పార్టీల కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ ఎంత కీలకపాత్ర పోషించారు ... కూటమి ఘనవిజయం సాధించడంలోనూ పవన్ అంతే పాత్ర పోషించారు.


అక్కడి వరకు బాగానే ఉంది .. అయితే జనసేన నుంచి మొత్తం పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ పార్టీకి కచ్చితంగా నాలుగు మంత్రి పదవులు వస్తాయని అనుకున్నారు. అయితే క్యాబినెట్లో మూడు పదవులు మాత్రమే వ‌చ్చాయి. జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాగూ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇక ఆ పార్టీకి ఎలక నేత నాదెండ్ల మనోహర్ తో పాటు కందుల‌ దుర్గేష్ కు సైతం క్యాబినెట్ పదవులు దక్కాయి. ఇక ఇప్పుడు క్యాబినెట్లో ఖాళీగా ఉన్న ఒకే ఒక బెర్త్‌ కోసం జనసేన డిమాండ్ చేస్తుంది. ఆ బెర్త్ ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన కేటాయించాలని జనసేన వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.


పవన్ సైతం జనసేనకు మరో మంత్రి పదవి కేటాయించాలని చంద్రబాబును కోరే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జనసేనకి ఇచ్చిన మూడు మంత్రి పదవులలో రెండు కాపు సామాజిక వర్గానికి దక్కాయి. ఒకవేళ ఆ ఒక్క పదవి కూడా జనసేనకి ఇస్తే అది జనసేన నుంచి ఏ వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఇస్తారు అన్నది చూడాలి. జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు - మండలి బుద్ధ ప్రసాద్ లాంటి కాపు నేతలతో పాటు కొందరు బీసీ నేతలు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మరి జనసేన డిమాండ్ చంద్రబాబు తీరుస్తారా ఆ ఒక్క మంత్రి పదవి ఎవరికి దక్కుతుంది అన్నది చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>