MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2293a9a00-aade-4ca0-91e8-e1fd9a7b6dec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2293a9a00-aade-4ca0-91e8-e1fd9a7b6dec-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ సుకుమార్ కలిసి చేసిన పుష్ప సినిమా గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇపుడు పుష్ప 2 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా నిజానికి ఆగష్టు 15కి రిలీజ్ కావలసి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన రిలీజ్ వాయిదా చేయడం జరిగింది. ఇపుడు డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ కాబోతోంది అంటూ వార్తలు వచ్చినప్పటికీ అది కూడా ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం ఇంకా డౌటే. ఐతే అల్లు అర్జున్ మీద, పుష్ప 2 మీద మెగా ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. Pushpa 2{#}Rajani kanth;Mega family;Arjun;Allu Aravind;Bunny Vas;August;Chiranjeevi;Event;Athadu;December;Pawan Kalyan;Allu Arjun;News;Cinemaపుష్ప 2కి పట్టుకున్న మెగా భయం?పుష్ప 2కి పట్టుకున్న మెగా భయం?Pushpa 2{#}Rajani kanth;Mega family;Arjun;Allu Aravind;Bunny Vas;August;Chiranjeevi;Event;Athadu;December;Pawan Kalyan;Allu Arjun;News;CinemaSun, 21 Jul 2024 14:49:00 GMTఅల్లు అర్జున్ సుకుమార్ కలిసి చేసిన పుష్ప సినిమా గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇపుడు పుష్ప 2 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా నిజానికి ఆగష్టు 15కి రిలీజ్ కావలసి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన రిలీజ్ వాయిదా చేయడం జరిగింది. ఇపుడు డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ కాబోతోంది అంటూ వార్తలు వచ్చినప్పటికీ అది కూడా ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం ఇంకా డౌటే. ఐతే అల్లు అర్జున్ మీద, పుష్ప 2 మీద మెగా ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. తన ఫ్రెండ్ కి సపోర్ట్ గా ఉన్నందుకు మెగా అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కోపానికి గురయ్యాడు అల్లు అర్జున్. ఐతే ఆ ఇంపాక్ట్ పుష్ప 2 మీద పడే అవకాశం ఉందనే నెపంతోనే సినిమా వాయిదాలు మీద వాయిదాలు పడుతోందని కొందరు అంటున్నారు.

అయితే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీగా చిత్రీకరిస్తున్న ఈ గొడవలు ఎంతవరకు నిజమనేది మాత్రం ఎవరికీ తెలియదు. అయితే రీసెంట్ గా బన్నీ వాసు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొంత డిస్ట్రబెన్స్ అయితే ఉందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అయితే సినిమా వాయిదాని ఇలానే పొడిగించుకుంటూ పోతే పుష్ప 2 సినిమామీద మరింత ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని సినిమా పండితులు అంటున్నారు. అందుకే అల్లు అరవింద్ మెగా ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. పుష్ప 2 సినిమా ఏదైనా ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడని వినికిడి. కానీ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ ఇలాంటివాటికి సముఖంగా లేడని గుసగుసలు వినబడుతున్నాయి.

అయితే ఎంత అనుకున్నా, కాదన్నా అల్లు అర్జున్ అనేవాడు మెగాస్టార్ లేకపోతే లేడు అనే విషయం అందరికీ తెలిసినదే. అతడు సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో మెగా ఫామిలీ హీరో అని చెప్పుకొనే వాడు... ఆ తరువాత కాలంలో సూపర్ స్టార్ డం తెచ్చుకున్నాక మాత్రం అల్లు ట్యాగ్ తగిలించుకొని... మెగా ఫామిలీ పేరుని విస్మరించాడనే విమర్శలు మనోడిపైన చాలా ఉన్నాయి.. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పైన మెగా అభిమానులు గుర్రుగా ఉన్నారని సమాచారం. ఏదిఏమైనా నేడు పుష్ప సినిమాకి మెగా భయం పట్టుకుంది అనేది మాత్రం నగ్న సత్యంగా పేర్కొంటున్నారు విశ్లేషకులు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>