MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-aarti-aggarwal-3acf03e5-e78c-41e9-9e32-1e01d59352a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-aarti-aggarwal-3acf03e5-e78c-41e9-9e32-1e01d59352a0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె మొదటి సినిమా, విక్టరీ వెంకటేష్ జోడీగా చేసిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెల్సిందే. ఆ సినిమాతో ఆమె ఇక వెనక్కి తిరిగి చూసుకువలసిన అవసరం లేకుండా పోయింది. ఆ తరువాత వరుసగా ఆమె తెలుగులో అవకాశాలు చేజిక్కించుకుంది. ఈ క్రమంలో పెద్ద హీరోల నుండి, సీనియర్ హీరోల వరకు అందరితోనూ నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి నుండి జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వరకు అందరి స్టార్Aarti Aggarwal {#}Venkatesh;aarthi;aarti agarwal;dr rajasekhar;Nuvvu Naaku Nachav;Prabhas;Heroine;Chiranjeevi;Hero;Varsham;media;Jr NTR;Yuva;Tarun Kumar;Director;Telugu;Cinemaఆర్తి అగర్వాల్ ను వారు దారుణంగా వాడుకున్నారు... స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు?ఆర్తి అగర్వాల్ ను వారు దారుణంగా వాడుకున్నారు... స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు?Aarti Aggarwal {#}Venkatesh;aarthi;aarti agarwal;dr rajasekhar;Nuvvu Naaku Nachav;Prabhas;Heroine;Chiranjeevi;Hero;Varsham;media;Jr NTR;Yuva;Tarun Kumar;Director;Telugu;CinemaSun, 21 Jul 2024 16:00:00 GMTటాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె మొదటి సినిమా, విక్టరీ వెంకటేష్ జోడీగా చేసిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెల్సిందే. ఆ సినిమాతో ఆమె ఇక వెనక్కి తిరిగి చూసుకువలసిన అవసరం లేకుండా పోయింది. ఆ తరువాత వరుసగా ఆమె తెలుగులో అవకాశాలు చేజిక్కించుకుంది. ఈ క్రమంలో పెద్ద హీరోల నుండి, సీనియర్ హీరోల వరకు అందరితోనూ నటించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి నుండి జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వరకు అందరి స్టార్ హీరోల సరసన ఆమె నటించి మెప్పించింది.

ఆ సినిమాలన్నీ ఒకెత్తయితే ఆమె యువ హీరో తరుణ్ తో చేసిన సినిమాలు వేరు అని చెప్పుకోవచ్చు. వారి కాబోలో వచ్చిన.. 'నువ్వులేక నేను లేను' సినిమా భాక్షాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో వీరు ప్రేమలో పడిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే వీరి కెరీర్ సజావుగా సాగుతుంది అనుకొనే లోపే ఆమె చేసిన కొన్ని సినిమాలు ప్లాఫ్ కావడం కారణంగా ఆర్తి కెరీర్ సన్నగిల్లింది. అదే క్రమంలో హీరో తరుణ్ కూడా హీరోగా ఫేడ్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత కాలంలో వీరిద్దరి రిలేషన్ కాస్త బీటలు వారింది. తరువాతి కాలంలో ఆర్తి శారీరకంగా బాగా లావు కావడం కూడా ఆమె సినిమా కెరీర్ పైన ఎఫెక్ట్ చూపింది. దాదాపు ఆమెకి తరువాత సినిమాలు లేకుండా పోయాయి.

ఈ నేపథ్యంలో లావు తగ్గాలన్న ఆరాటంతో ఆమె లైపో సెక్షన్ ట్రిట్మెంట్ చేసుకొని అది కాస్త వికటించి.. కొంత కాలానికి ఆమె మరణించింది. అలా ముచ్చటగా మూడు పదులు వయస్సు నిండకుండానే.. ఆర్తి అగర్వాల్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం యావత్ తెలుగు చిత్ర పరిశ్రమని శోక సంద్రంలోకి నెట్టింది. అయితే ఆమె మరణించిన చాన్నాళ్ల తరువాత ప్రముఖ స్టార్ కొరియో గ్రఫర్, డైరెక్టర్ కమ్ యాక్టర్ అమ్మా రాజశేఖర్ తాజాగా ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ.. ఆమె గురించి కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసాడు. రణం2 సినిమాలో ఆర్తి అగర్వాల్ అమ్మా రాజశేఖర్ కు జంటగా నటించిన సంగతి విదితమే. కాగా ఈ సినిమా షూటింగులో ఖాళీ సమయాల్లో ఆమె జీవితం నాశనం అవ్వడానికి గల కారణాలను రాజశేఖర్ కి చెప్పుకొచ్చిందట. ఇండస్ట్రీలో పెద్ద వారు అనబడేవారే తనని మోసం చేసినట్టు చెప్పుకుంటూ వాపోయింది రాజశేఖర్మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. అయితే వారి పేర్లు మాత్రం ఆయన వెల్లడించకపోవడం గమనార్హం







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>