MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg‘గుంటూరు కారం’ ఆశించిన ఘన విజయాన్ని అందుకోలేకపోవడంతో షాక్ అయిన త్రివిక్రమ్ మౌన ముద్రలో కాలం గడుపుతున్నాడు అంటూ చాలమంది ఊహాగానాలు చేశారు. అయితే అది కేవలం ఊహ మాత్రమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా త్రివిక్రమ్ తన టీమ్ తో కలిసి అల్లు అర్జున్ తో తీయబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కథ కోసం చాల సీరియస్ గా ఆలోచనలు చేయడమే కాకుండా డానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను కూడ మొదలు పెట్టినట్లు లీకులు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు త్రివిక్రమ్ తయారు చేస్తున్న ఈ కథ ఒక సైన్స్ ఫిక్షalluarjun{#}Rajamouli;trivikram srinivas;Hollywood;Allu Arjun;Cinema;Audience;Telugu;News;Indiaషాకింగ్ కాన్సెప్ట్ తో అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ !షాకింగ్ కాన్సెప్ట్ తో అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ !alluarjun{#}Rajamouli;trivikram srinivas;Hollywood;Allu Arjun;Cinema;Audience;Telugu;News;IndiaSat, 20 Jul 2024 09:00:00 GMT‘గుంటూరు కారం’ ఆశించిన ఘన విజయాన్ని అందుకోలేకపోవడంతో షాక్ అయిన త్రివిక్రమ్ మౌన ముద్రలో కాలం గడుపుతున్నాడు అంటూ చాలమంది ఊహాగానాలు చేశారు. అయితే అది కేవలం ఊహ మాత్రమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా త్రివిక్రమ్ తన టీమ్ తో కలిసి అల్లు అర్జున్ తో తీయబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కథ కోసం చాల సీరియస్ గా ఆలోచనలు చేయడమే కాకుండా డానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను కూడ మొదలు పెట్టినట్లు లీకులు వస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు త్రివిక్రమ్ తయారు చేస్తున్న ఈ కథ ఒక సైన్స్ ఫిక్షన్ అని తెలుస్తోంది. స్వతహాగా న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ అయిన త్రివిక్రమ్ ఈసారి తన కుటుంబ బాంధవ్యాలు ఆ కుటుంబ సభ్యుల ఇగోలు లాంటి సున్నితమైన విషయాల నుండి బయటపడి నెటితరం ప్రేక్షకులు ఇష్టపడుతున్న హాలీవుడ్ రేంజ్ ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.


వాస్తవానికి ‘పుష్ప 2’ తరువాత బన్నీ నటించవలసిన సినిమా కథ ఇంతవరకు ఏదీ ఫైనల్ కాలేదు. బన్నీ కెరియర్ లో వరసగా మూడు సూపర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ సరైన కథతో పాన్ ఇండియా రేంజ్ లో ముందుకు రాగలిగితే అతడితో సినిమా చేయాలని బన్నీ ఎప్పటి నుంచో భావిస్తున్నాడు. తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి సంబంధించి రాజమౌళి నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు తమ కొత్తకొత్త ఆలోచనలతో భారీ సినిమాలు తీస్తుంటే త్రివిక్రమ్ మాత్రం తనకు గతంలో కలిసి వచ్చిన ‘అత్తారింటికి దారేది’ రొటీన్ కథలను నమ్ముకుని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయోగాలు చేస్తూ సరైన ఫలితాలు అందుకోలేక పోతున్నాడు.


దీనితో తన రూట్ మార్చుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడ ఫిక్షన్ కథల వైపు అడుగులు వేస్తూ ఈనాటి తరం ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మారాలని ప్రయత్నాలు చేస్తున్నాడు అనుకోవాలి..  












మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>