HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health9c3e5013-fc1a-43d7-9a9b-31f023e521e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health9c3e5013-fc1a-43d7-9a9b-31f023e521e0-415x250-IndiaHerald.jpgమీరు బరువు తగ్గాలనుకుంటే పొరపాటున కూడా ఇలా చెయ్యకండి? చెడు జీవనశైలి, ఎక్కువ చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది బరువు పెరుగుతుంటారు. ముఖ్యంగా నగరాల్లో ఇది ఎక్కువైపోయింది. ప్రజలు తన పని బిజీలో పడి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.దీంతో ఊబకాయం బారిన పడి అనేక రకాల వ్యాధుల భారీనాపడుతుంటారు. ఇక బరువును నియంత్రించుకోవడం కోసం చాలా మంది చాలా మార్గాలను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాయామం ఇంకా కొందరు యోగాను కూడా ప్రారంభిస్తారు. అయితే బరువు తగ్గడానికి చేసే పHealth{#}Shakti;Kanna Lakshminarayana;oil;Manamమీరు బరువు తగ్గాలనుకుంటే పొరపాటున కూడా ఇలా చెయ్యకండి?మీరు బరువు తగ్గాలనుకుంటే పొరపాటున కూడా ఇలా చెయ్యకండి?Health{#}Shakti;Kanna Lakshminarayana;oil;ManamSat, 20 Jul 2024 21:17:00 GMTచెడు జీవనశైలి, ఎక్కువ చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది బరువు పెరుగుతుంటారు. ముఖ్యంగా నగరాల్లో ఇది ఎక్కువైపోయింది. ప్రజలు తన పని బిజీలో పడి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.దీంతో ఊబకాయం బారిన పడి అనేక  రకాల వ్యాధుల భారీనాపడుతుంటారు. ఇక బరువును నియంత్రించుకోవడం కోసం చాలా మంది చాలా మార్గాలను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాయామం ఇంకా కొందరు యోగాను  కూడా ప్రారంభిస్తారు. అయితే బరువు తగ్గడానికి చేసే ప్రయత్నంలో కొందరు చేసే తప్పుల కారణంగా బరువు తగ్గకపోగా..  ఇంకా అధిక బరువు పెరుగుతుంటారు. ఈ క్రమంలో వారు చేసే ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.అధిక బరువు సులభంగా తగ్గవచ్చు అని చెప్పి కొందరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తినడం మానేస్తుంటారు. నేరుగా మధ్యాహ్నం లంచ్ చేస్తారు. ఇది ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయం తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది. రాత్రంతా మన శరీరానికి ఎలాంటి ఆహారం అందదు. కాబట్టి  శక్తి కోసం శరీరం మనం ఉదయం తినే ఆహారంపై ఆధార పడుతుంది. అలాగే పోషకాలు కూడా మనకు ఎక్కువగా ఉదయం ఆహారం నుంచే మన శరీరనికి అందుతాయి. అలాంటప్పుడు ఉదయం ఆహారం మానేస్తే మనకు లాభం కలగకపోగా మరింత నష్టమే జరుగుతుంది. 


అలాగే ఉదయం ఆహారం మానేసేవారు రోజులో ఇతర సమయాల్లో సాధారణం కన్నా ఎక్కువే తింటారట. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయకూడదు. ఏదో ఒకటి తినాల్సిదే. కావాలంటే రాత్రి పూట త్వరగా భోజనం చేయవచ్చు. తక్కువగా  తినవచ్చు. దీంతో బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.ఇక మనం తినే ఆహారం జీర్ణం అయి మనకు పోషకాలు, శక్తి సరిగ్గా లభించాలంటే రోజూకు తగినన్ని నీళ్లను తాగడం  శరీరనికి చాలా అవసరం. కొందరు నీళ్లను ఎక్కువగా తాగరు. ఎంత ఆహార నియమాలను పాటించినా నీళ్లను తాగకపోతే బరువు తగ్గరు. బరువు పెరుగుతారు. కనుక రోజూ తగినన్ని నీళ్లను తాగాల్సి ఉంటుంది.  నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల లాభమే తప్ప నష్టమేమి లేదు. ఉదయాన్నే నీళ్లు తాగడం ఆరోగ్యనికి ఎంతో మంచిది.అలాగే కొందరు ఉదయాన్నే అనారోగ్యకరమైన ఆహారంతో రోజును ప్రారంభిస్తారు. చక్కెర లేదా నూనె పదార్థాలను ఉదయాన్నే ఎక్కువగా తింటారు. ఇది కూడా బరువును, చోలేస్త్రోల్ ను పెంచుతుంది. మీరు బరువు తగ్గించుకునే ప్రయత్నం లో ఉంటే ఉదయం ఫైబర్‌, ప్రోటీన్లు ఉండే ఆహారాలను తినాలి. ఇవి బరువు తగ్గేందుకు, ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. ఇలాంటి కొన్ని తప్పులు జరగకుండా చూసుకోవడం వల్ల మీరు త్వరగా బరువు తగ్గేందుకు చాలా అవకాశాలు ఉంటాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>