PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganmohanreddy2b1da3a5-ccf5-49c6-b367-c9eed1d48f8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganmohanreddy2b1da3a5-ccf5-49c6-b367-c9eed1d48f8a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం పాలయ్యింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. మొదటిసారి జరిగిన శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కక పోవడానికి అవమానంగా భావించారు. అసెంబ్లీలో కూటమి సభ్యులను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని కూడా గుర్తించారు. అందుకే మొదటి అసెంబ్లీ సమావేశంలో కాసేపు కూడా కూర్చునేందుకు ఇష్టపడలేదు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి అనగా.. బెంగళూరు వెళ్ళిపోయారు. దీంjaganmohanreddy{#}Rajya Sabha;monday;Assembly;Governor;YCP;Vinukonda;Jagan;TDPఏపీ: అసెంబ్లీ వైపు అడుగులు వేయబోతున్న జగన్... కాకపోతే.?ఏపీ: అసెంబ్లీ వైపు అడుగులు వేయబోతున్న జగన్... కాకపోతే.?jaganmohanreddy{#}Rajya Sabha;monday;Assembly;Governor;YCP;Vinukonda;Jagan;TDPSat, 20 Jul 2024 08:08:02 GMT ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం పాలయ్యింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. మొదటిసారి జరిగిన శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కక పోవడానికి అవమానంగా భావించారు. అసెంబ్లీలో కూటమి సభ్యులను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని కూడా గుర్తించారు. అందుకే మొదటి అసెంబ్లీ సమావేశంలో కాసేపు కూడా కూర్చునేందుకు ఇష్టపడలేదు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి అనగా.. బెంగళూరు వెళ్ళిపోయారు. దీంతో ఆయన సభకు హాజరుపై సస్పెన్స్ నెలకొంది. జగన్ మనస్తత్వం తెలిసిన వారంతా అసెంబ్లీకి రారని తేల్చేశారు.కానీ అనూహ్యంగా ఆయన అసెంబ్లీకి హాజరుకావాలని నిర్ణయించినట్లుగా వైసీపీ నేతలు చెబుతున్నారు.దానికి కారణం ప్రస్తుతం రాష్ట్రంలో రావణకష్టంగా పాలనా జరుగుతుందని దానిని ఖండిచి ప్రజల ముందు పెట్టడానికే జగన్ అడుగులు అసెంబ్లీ వైపు వేస్తున్నారని తెలుస్తుంది.

రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, చిన్నారులపై అత్యాచారాలపై విపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాజాగా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ ను కత్తితో నరికి చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. దీంతో నిన్న వినుకొండ వెళ్లి మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జగన్అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై స్పష్టత ఇచ్చారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరుకానున్నట్లు జగన్ వెల్లడించారు.జూలై 22న సోమవారం అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఉభయసభల్ని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని అడ్డుకుంటామని వైఎస్ జగన్ హెచ్చరించారు. ఆ తర్వాత రోజు ఢిల్లీకి తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లి నిరసన చేపడతామని జగన్ తెలిపారు. అయితే గతంలో తొలి సెషన్ సందర్భంగా కూడా జగన్ మొదటి రోజు హాజరై ఆ తర్వాత తిరిగి అసెంబ్లీకి వెళ్లలేదు. ఈసారి కూడా తొలి రోజు మాత్రమే జగన్ హాజరై అదీ గవర్నర్ ప్రసంగం అడ్డుకుని వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది.ఐతే దానికి టీడీపీ నేతలు జగన్ వ్యూహాత్మకంగా అసెంబ్లీ బహిష్కరణకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 2014లో విపక్షంలోకి వచ్చిన వైసీపీ అప్పట్లో కూడా అసెంబ్లీని బహిష్కరించింది. అప్పటి టిడిపి ప్రభుత్వం తమను మాట్లాడనీయడం లేదని ఆక్షేపిస్తూ శాసనసభ నుంచి బయటకు వెళ్లింది. ఇప్పుడు కూడా అటువంటి ఎత్తుగడే వేసినట్లు తెలుస్తోందని అంటున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>