PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-cm-revanth-reddy-ts-cm-revanth-reddy-cm-revanth-reddy--rona-mafi-telangana-government88bba095-3269-493a-a037-07a602841198-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-cm-revanth-reddy-ts-cm-revanth-reddy-cm-revanth-reddy--rona-mafi-telangana-government88bba095-3269-493a-a037-07a602841198-415x250-IndiaHerald.jpg- తెలంగాణలో 26 మంది రైతుల‌కు రేవంత్ రుణ‌మాఫీ చేస్తాడా - 15 ల‌క్ష‌ల మందికి రు. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ త‌ప్ప‌దు ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వస్తే.. రుణ మాఫీ చేస్తామ‌ని రైతుల‌కు ఇచ్చిన వాగ్దానం మేర‌కు రేవంత్ రెడ్డి స‌ర్కారు రుణ‌మాఫీకి ద్వారాలు తెరిచింది. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా 26 ల‌క్ష‌ల మందికి పైగా రైతుల‌కు రుణాలను మాఫీ చేయ‌నుంది. వీరిలో ఇప్పుడు తొలి విడ‌త‌గా.. రూ.ల‌క్ష‌లో పు రుణం తీసుకున్న వారికి మాఫీ చేస్తున్నారు. వీరి సంఖ్యేTelangana CM revanth Reddy; ts CM revanth Reddy; CM revanth Reddy; Rona mafi; Telangana government{#}revanth;Mandula;Telangana;RTC;Assembly;Arogyasri;Amaravathi;Anandam;CM;Revanth Reddy;Indiaరుణ మాఫీ అంత ఈజీకాదు.. తెలంగాణ ఫ్యూచ‌రేంటి..?రుణ మాఫీ అంత ఈజీకాదు.. తెలంగాణ ఫ్యూచ‌రేంటి..?Telangana CM revanth Reddy; ts CM revanth Reddy; CM revanth Reddy; Rona mafi; Telangana government{#}revanth;Mandula;Telangana;RTC;Assembly;Arogyasri;Amaravathi;Anandam;CM;Revanth Reddy;IndiaSat, 20 Jul 2024 07:41:54 GMT- తెలంగాణలో 26 మంది రైతుల‌కు రేవంత్ రుణ‌మాఫీ చేస్తాడా
- 15 ల‌క్ష‌ల మందికి రు. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ త‌ప్ప‌దు

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వస్తే.. రుణ మాఫీ  చేస్తామ‌ని రైతుల‌కు ఇచ్చిన వాగ్దానం మేర‌కు రేవంత్ రెడ్డి స‌ర్కారు రుణ‌మాఫీకి ద్వారాలు తెరిచింది.  ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా 26 ల‌క్ష‌ల మందికి పైగా రైతుల‌కు రుణాలను మాఫీ చేయ‌నుంది. వీరిలో ఇప్పుడు తొలి విడ‌త‌గా.. రూ.ల‌క్ష‌లో పు రుణం తీసుకున్న వారికి మాఫీ చేస్తున్నారు. వీరి సంఖ్యే 11.5ల‌క్ష‌లుగా ఉంది. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు మాఫీ చేయాలంటే.. మిగిలిన 15 ల‌క్ష‌ల మంది ఉన్నారు.


ఎలా చూసుకున్నా.. ఇది అంత ఈజీకాదు. ప్ర‌స్తుతం 11.5 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ.ల‌క్ష చొప్పున మాఫీ చేసేందుకు ఏకంగా.. 7 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసింది. ఇది రైతుల క‌ళ్ల‌లో ఆనందం క‌లిగిస్తుం దేమో.. కానీ, రాష్ట్ర భ‌విష్య‌త్తును త‌లుచుకుంటే మాత్రం క‌న్నీరు పెట్టిస్తుంది. రైతుల‌కు మేలు చేయొద్ద‌ని ఎవ‌రూ చెప్ప‌రు.కానీ, రుణ మాఫీ ద్వారా మేలు పొందిన రైతుల‌ను ఎక్క‌రినైనా ప్ర‌భుత్వాలు చూపించ‌డం లేదు. నిజానికి రుణ మాఫీ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. కొంద‌రు రాజ‌కీయ నేత‌లే.. రైతుల‌కు విరివిగా సొమ్ములు ఇచ్చి.. దొడ్డిదారిలో స‌ర్కారు నుంచి సొమ్ములు గుంజుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.


ఇలాంటి స‌మ‌యంలో రైతుల‌ను స్వావ‌లంబ‌న దిశ‌గా న‌డిపించే ప్ర‌య‌త్నం చేయాలి. చేతిలో న‌కిలీ మందులు లేకుండా.. పురుగు మందుల ధ‌ర‌లు పెంచ‌కుడా.. నాణ్య‌మైన విత్త‌నాల‌ను అందుబాటులో ఉంచితే.. ఏ అన్న‌దాతా కూడా.. రుణ మాఫీ కోసం ఎదురు చూడ‌డు.. కొయ్య‌కు తాడు క‌ట్టుకుని వేలాడ బ‌డ‌డు. స‌రే.. ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం తెచ్చిన సొమ్ములు.. ఆర్బీఐ నుంచి దీనికి ప్ర‌భుత్వం వ‌డ్డీ క‌ట్టాలి. మ‌రి ఇవి ఏడ‌నుంచి తెస్త‌ది! అంటే.. మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌నుంచే అంటే వేరే రూపంలో స‌ర్కారు రాబ‌డుతుంది.


అంటే మొత్తంగా.. రైతు రుణ మాఫీతో ఎవ‌రు బాగు ప‌డుతున్నారు ? అంటే.. ద‌ళారులు.. వడ్డీ వ్యాపారులు త‌ప్ప‌.. నిజంగా రైతుల‌కు మేలు అయితే క‌ల‌గ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా ఇప్పుడు చేస్తున్న అప్పుల కార‌ణంగా తెలంగాణ మ‌రిన్ని అప్పులు చేయాల్సి వ‌స్తుంది. త‌ద్వారా.. రాష్ట్రంలో అభివృద్ధి ప‌థ‌కాలు.. ప్రాజెక్టులు వంటివి ఎలా ముందుకు సాగుతాయ‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.


అధికారంలో కోసం..


రైతు రుణ మాఫీ అయినా.. మ‌రో ప‌థ‌క‌మైనా.. అధికారం కోసం పాకులాటే క‌నిపిస్తోంది. ఎన్నికల హామీల అమలుకు కట్టుబడి ఉన్నామ‌నిచెబుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత  ప్రయాణం ఇచ్చారు. ఇది ఏడాదికి 450 కోట్ల భార‌మ‌ని అధికారులు తేల్చారు. ఆరోగ్యశ్రీ పెంచారు. ఇది ఏకంగా 500 కోట్ల భారం. ఇప్పుడు రైతు రుణమాఫీ.. ఈ భారం 20 వేల కోట్ల పైచిలుకు. ఎలా చూసుకున్నా.. ప్ర‌భుత్వం చేప‌లు ప‌ట్ట‌డం నేర్పిస్తే.. బాగుంటుంది కానీ.. ప‌ట్టి తెచ్చి ఇస్తే.. ఎన్నాళ్ల‌యినా.. ఏ స‌ర్కారైనా ఇంతే!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>