PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-ap-cm-chandrababu-chandrababu-naidu-ap-government-pm-modi-amit-shah6bf26715-7a68-4882-8190-9d8677a1564b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-ap-cm-chandrababu-chandrababu-naidu-ap-government-pm-modi-amit-shah6bf26715-7a68-4882-8190-9d8677a1564b-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నెల రోజుల్లో మూడు సార్లు ఢిల్లీ వెళ్లారు. వాస్త‌వానికి నాలుగు సార్లు ఆయ‌న హ‌స్తిన‌లో ప‌ర్య‌టించినా.. ఒక‌సారి మాత్రం ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీని ఎన్నుకునే కార్య‌క్ర‌మానికే ప‌రిమిత‌మ‌య్యారు. మిగిలిన మూడు సార్లు మాత్రం ఏపీకి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు వెళ్లారు. అధికారంలోకి రాగానే.. ఫైళ్లు ప‌క్క‌న పెట్టి.. త‌న‌కున్న ప‌రిజ్ఞానంతో కేంద్రం ముందు స‌మ‌స్య‌లు ఏక‌రువు పెట్టారు. ప్ర‌త్యేక హోదా విష‌యం ప్ర‌స్తావించ‌కుండానే.. ఏపీకి న్యాయం చేయాల‌న్నారు. ఆ త‌ర్వాతChandrababu; AP CM Chandrababu; Chandrababu Naidu; AP government; PM Modi; Amit Shah{#}Delhi;Bharatiya Janata Party;Bihar;central government;Andhra Pradeshవిన్న‌పాలు వింటారా.. బాబు ప్ర‌య‌త్నం ఫ‌లించేనా.. ?విన్న‌పాలు వింటారా.. బాబు ప్ర‌య‌త్నం ఫ‌లించేనా.. ?Chandrababu; AP CM Chandrababu; Chandrababu Naidu; AP government; PM Modi; Amit Shah{#}Delhi;Bharatiya Janata Party;Bihar;central government;Andhra PradeshSat, 20 Jul 2024 07:33:08 GMTటీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నెల రోజుల్లో మూడు సార్లు ఢిల్లీ వెళ్లారు. వాస్త‌వానికి నాలుగు సార్లు ఆయ‌న హ‌స్తిన‌లో ప‌ర్య‌టించినా.. ఒక‌సారి మాత్రం ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీని ఎన్నుకునే కార్య‌క్ర‌మానికే ప‌రిమిత‌మ‌య్యారు. మిగిలిన మూడు సార్లు మాత్రం ఏపీకి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు వెళ్లారు. అధికారంలోకి రాగానే.. ఫైళ్లు ప‌క్క‌న పెట్టి.. త‌న‌కున్న ప‌రిజ్ఞానంతో కేంద్రం ముందు స‌మ‌స్య‌లు ఏక‌రువు పెట్టారు. ప్ర‌త్యేక హోదా విష‌యం ప్ర‌స్తావించ‌కుండానే.. ఏపీకి న్యాయం చేయాల‌న్నారు.


ఆ త‌ర్వాత‌.. ప‌లువురు ఎంపీల‌ను తీసుకుని.. ప్ర‌దాని మోడీని క‌లుసుకున్నారు. తాజాగా మాత్రం అన్ని వివ‌రాలు.. లెక్క‌లు వేసుకుని మ‌రీ.. ఆయ‌న కేంద్రం ద‌గ్గ‌ర సొమ్ముల కోసం.. విన్న‌పాలు వినిపించారు. ఈ నెల 23న కేంద్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌నున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడి మార్కుడి లా కేంద్ర వ‌ద్ద ఏపీ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. ఇది మంచి ప‌రిణామ‌మే. ఏపీకి కావాల్సింది కూడా ఇదే. అయితే.. కేంద్రం ఎంత వ‌ర‌కు చంద్ర‌బాబు విన్న‌పాలు ఆల‌కిస్తుంద‌నేది చూడాలి.


ప్ర‌ధానంగా కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు బీహార్ నుంచి కూడా ఇంత కు మించిన స‌మ‌స్యలే ఉన్నాయి. ఏకంగా 30 వేల కోట్లను త‌మ‌కు త‌క్ష‌ణం కేటాయించాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. మ‌రోవైపు.. బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, కూట‌మి పార్టీల నేతృత్వంలోని మ‌హారాష్ట్ర స‌హా ఇత‌ర రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎన్నిక‌లు ఉన్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల‌కు కూడా నిధులు కేటాయించాల్సి ఉంది. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఎదురైన ప‌రాభ‌వం నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఆయా రాష్ట్రాల్లో విజ‌యం ద‌క్కించుకోవాల్సి రావ‌డం మోడీకి స‌వాల్‌గా మారింది.


ఇలాంటి కీల‌క స‌మ‌యంలో కేంద్రం నుంచి ఏపీకి వ‌చ్చే వ‌రాలు ఎన్ని?  సొమ్ములు ఎన్ని? అనేది ప్ర‌శ్న. ఇది కేంద్రం నుంచి చూస్తే.. ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌., ఇక‌, ఏపీ వైపు నుంచి చూస్తే.. మోడీ స‌ర్కారును నిల‌బెట్ట‌డంలో చంద్ర‌బాబు కీల‌కంగా ఉన్నారు. దీంతో ఆయ‌న ఇప్పుడు తొలి ద‌శ‌లోనే.. ఏపీకి నిధులు సాధించాల్సి రావ‌డం.. స‌వాల్‌గా మారింది. లేక‌పోతే..  కేంద్రంలో పొత్తు పెట్టుకుని ఏపీకి సాధించిందేంట నే ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతాయి. దీనికి స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి రానుంది. సో.. ఎలా చూసుకున్నా.. కేంద్రాన్ని ఏమేర‌కు ఒప్పిస్తారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>