MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrcef894e8-dd9d-4dcb-a9c1-10c217ac0be1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrcef894e8-dd9d-4dcb-a9c1-10c217ac0be1-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్లో ఉన్న మంచినటుల్లో ముందు వరుసలో నిలుస్తాడు మన జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ మొదట్లోనే మాస్ ఆడియన్స్ కు చాలా దగ్గరైన తారక్ తన యాక్షన్ సీన్స్, ఎమోషన్ తో ప్రేక్షకులను కట్టి పడేస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక తన డ్యాన్స్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఐతే ఈమధ్య వెండితెర మీద సోషియో ఫాంటసీ, మైథలాజికల్NTR{#}koratala siva;prashanth neel;Mahabharatham;Prasanth Neel;NTR;Jr NTR;Audience;CBN;Mass;Rajamouli;Indian;Hero;Cinema;warజూనియర్ ఎన్టీఆర్ కి అలాంటి సినిమా పడితేనా?జూనియర్ ఎన్టీఆర్ కి అలాంటి సినిమా పడితేనా?NTR{#}koratala siva;prashanth neel;Mahabharatham;Prasanth Neel;NTR;Jr NTR;Audience;CBN;Mass;Rajamouli;Indian;Hero;Cinema;warSat, 20 Jul 2024 18:00:00 GMTజూనియర్ ఎన్టీఆర్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్లో ఉన్న మంచినటుల్లో ముందు వరుసలో నిలుస్తాడు మన జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ మొదట్లోనే మాస్ ఆడియన్స్ కు చాలా దగ్గరైన తారక్ తన యాక్షన్ సీన్స్, ఎమోషన్ తో ప్రేక్షకులను కట్టి పడేస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక తన డ్యాన్స్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఐతే ఈమధ్య వెండితెర మీద సోషియో ఫాంటసీ, మైథలాజికల్ స్టోరీలకు ఎక్కువ గిరాకీ పెరగడంతో ఎన్టీఆర్ అభిమానులు అటువంటి సినిమా తమ హీరో చేస్తే చూసి తరించాలని ఆరాటపడుతున్నారు.

అవును, నిజమే.. ట్రెండ్ మారింది. ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఇపుడు ఇతిహాస గాధలను చూడాలని కోరుకుంటున్నారు. ఐతే ఇప్పటికే కెరీర్ లో అలాంటి ఒక అటెంప్ట్ చేసిన ఎన్టీఆర్ నుంచి అలాంటి మరో సినిమా ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన 'యమదొంగ' సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. దాంతోనే ఇప్పుడు తమ జూనియర్ అలాంటి ప్రయత్నాలు చేస్తే బావుంటుందని అనుకుంటున్నారు ఫాన్స్. ఇక ఎన్టీఆర్ నవసరసాలు పలికించగలిగే ఆర్టిస్ట్ కాబట్టి అటువంటి సినిమా ఎన్టీఆర్ కి పడితే రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయం అని సినిమా విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర, వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలతో కలిపి మరో 3, 4 ఏళ్లు బిజీగా ఉంటాడు. ఆ తరువాత అయినా తమ హీరో జానపద సినిమాల వైపు ముగ్గు చూపాలని అనుకుంటున్నారు ఫాన్స్. మరోవైపు రాజమౌళి మహేష్ బాబు సినిమా తరువాత మహాభారతం చేసే ఆలోచనలో ఉన్నట్టు కనబడుతోంది. అలా చేస్తే అందులో అయినా ఎన్టీఆర్ నటించాలని ప్రార్ధనలు చేస్తున్నారు. మరి రాజమౌళి ఆ సినిమాని తీస్తే తారక్ ని ఏ పాత్రలో చూపిస్తాడన్నది తెలియదు కానీ ఆ సినిమా వస్తే మాత్రం ఊహలకు కూడా అందని రేంజ్ లో రికార్డులు సృష్టిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>