PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pilli-subhash-chandraboshc3db5ea5-b1c1-4a2a-8c0d-b1575446ef17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pilli-subhash-chandraboshc3db5ea5-b1c1-4a2a-8c0d-b1575446ef17-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసిపి... అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే. కేవలం 11 సీట్లే సంపాదించుకున్న వైసిపి పార్టీ... ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. అటు నాలుగు ఎంపీలు గెలుచుకున్న వైసిపి... ఏపీలో ప్రతిపక్ష హోదాను కూడా పొందలేకపోయింది. అటు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు రావడంతో... తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి వైసిపిని టార్గెట్ చేస్తున్నారు. pilli subhash chandrabosh{#}chandra bose;chandrabose;Telugu Desam Party;Pilli Subhash Chandra Bose;Subhas Chandra Bose;Bharatiya Janata Party;Telugu;Rajya Sabha;YCP;News;MP;Reddy;Jaganకష్టాల్లో జగన్...బీజేపీలోకి కీలక నేత ?కష్టాల్లో జగన్...బీజేపీలోకి కీలక నేత ?pilli subhash chandrabosh{#}chandra bose;chandrabose;Telugu Desam Party;Pilli Subhash Chandra Bose;Subhas Chandra Bose;Bharatiya Janata Party;Telugu;Rajya Sabha;YCP;News;MP;Reddy;JaganSat, 20 Jul 2024 08:56:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసిపి... అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే. కేవలం 11 సీట్లే సంపాదించుకున్న వైసిపి పార్టీ... ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. అటు నాలుగు ఎంపీలు గెలుచుకున్న వైసిపి... ఏపీలో ప్రతిపక్ష హోదాను కూడా పొందలేకపోయింది. అటు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు రావడంతో... తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి వైసిపిని టార్గెట్ చేస్తున్నారు.


వైసిపి కార్యాలయాలను ధ్వంసం చేయడం... వైసీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్ నేతలను టార్గెట్ చేయడం లాంటివి తెలుగుతమ్ములు ప్రస్తుతం చేస్తున్నారు. దీంతో వైసిపి పార్టీ నేతలు అష్ట కష్టాలు పడుతున్నారు. వైసీపీలో ఉంటే కష్టాలు ఉంటాయని వేరే పార్టీలోకి వెళ్దామన్నా... బిజెపి వారు అసలు రానివ్వడం లేదు. ఎందుకంటే కూటమిలో... భారతీయ జనతా పార్టీ కూడా ఉండటం  వైసిపి నేతలకు పెద్ద సమస్యగా మారింది.

లేకపోతే ఇప్పటికే చాలామంది వైసిపి నేతలు భారతీయ జనతా పార్టీలోకి... వెళ్లేవారు.అయితే ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఇలాంటి కీలక నేతలు బిజెపిలోకి వెళ్తారని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు రాజ్యసభ సభ్యులు  పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా... బిజెపి పార్టీలోకి వెళ్తారని వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే బిజెపిలోకి జంప్ అవుతారని వార్తలు వచ్చాయి.


అయితే ఈ వార్తలపై స్వయంగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందించారు.  అసలు తాను ఏ పార్టీలోకి వెళ్ళనని.. వైసీపీలోనే ఉంటానని ఆయన తేల్చి చెప్పారట. అంతేకాదు వైసిపి పార్టీ పెట్టిన నేపథ్యంలో... కాంగ్రెస్ను వదిలేసి జగన్ చెంతన చేరారు సుభాష్.  ఈ తరుణంలోనే వైసీపీలో కీలక పదవులను కూడా పిల్లి సుభాష్  చంద్రబోస్ కు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అయితే ఆ విశ్వాసంతో వైసీపీ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా నిలవాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ అనుకుంటున్నారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>