MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/raviteja9e62c1ca-301b-4acc-9d3e-eb2f1fd76eb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/raviteja9e62c1ca-301b-4acc-9d3e-eb2f1fd76eb6-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. రవితేజ వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ తన అభిమానులను ఆనంద పరుస్తున్న ఆ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆయన అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. ఆఖరుగraviteja{#}sree;Krack;Mister;prasad;Ravi;ravi teja;Box office;Akkineni Nageswara Rao;Hero;harish shankar;Music;producer;Producer;Heroine;Cinema;media;Telugu;Tollywoodఅభిమానులను టెన్షన్ లో పడేసిన రవితేజ.. ఈసారైనా వారికి ఆనందం కలిగించేనా..?అభిమానులను టెన్షన్ లో పడేసిన రవితేజ.. ఈసారైనా వారికి ఆనందం కలిగించేనా..?raviteja{#}sree;Krack;Mister;prasad;Ravi;ravi teja;Box office;Akkineni Nageswara Rao;Hero;harish shankar;Music;producer;Producer;Heroine;Cinema;media;Telugu;TollywoodSat, 20 Jul 2024 15:30:00 GMTమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. రవితేజ వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ తన అభిమానులను ఆనంద పరుస్తున్న ఆ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆయన అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు.

ఆఖరుగా రవితేజ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్ అనే మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన కిలాడి , రామారావు ఆన్ డ్యూటీ , టైగర్ నాగేశ్వరరావు , ఈగల్ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కానుంది.

మూవీ కి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తూ ఉండగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ విషయం పక్కన పెడితే క్రాక్ మూవీ తర్వాత వరస అపజయాలు రావడంతో రవితేజ అభిమానులు ఈ సినిమాతో రవితేజ అద్భుతమైన విజయాన్ని అందుకుంటాడు అని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అయిన రవితేజ మంచి విజయాన్ని అందుకొని మళ్ళీ కం బ్యాక్ అవుతాడేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>