Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6d0106c4-5b64-4dc8-b180-5fa616338d06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6d0106c4-5b64-4dc8-b180-5fa616338d06-415x250-IndiaHerald.jpgఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.బాక్సాఫీస్ వద్ద 'కల్కి' జైత్రయాత్ర ఇంకా కొనసాగుతున్నది. పాన్ ఇండియా నటుడు ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.ఇప్పటికే ఈ మూవీ రీసెంట్‌గా రూ.800 కోట్ల క్లబ్‌లో చేరినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రూ.900 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయ్యి socialstars lifestyle{#}Mahabharatham;nag ashwin;Blockbuster hit;Darsakudu;Audience;Chitram;Director;Hollywood;vijay kumar naidu;June;India;Telugu;Cinemaబాక్స్ఆఫీస్ పై కోట్ల వర్షం కురిపిస్తున్న "కల్కి"..!బాక్స్ఆఫీస్ పై కోట్ల వర్షం కురిపిస్తున్న "కల్కి"..!socialstars lifestyle{#}Mahabharatham;nag ashwin;Blockbuster hit;Darsakudu;Audience;Chitram;Director;Hollywood;vijay kumar naidu;June;India;Telugu;CinemaFri, 19 Jul 2024 22:15:00 GMTఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.బాక్సాఫీస్ వద్ద 'కల్కి' జైత్రయాత్ర ఇంకా కొనసాగుతున్నది. పాన్ ఇండియా నటుడు ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.ఇప్పటికే ఈ మూవీ రీసెంట్‌గా రూ.800 కోట్ల క్లబ్‌లో చేరినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రూ.900 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయ్యి రూ.1000 కోట్ల దిశగా దూసుకుపోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

యూనివర్శల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులు కొత్త అనుభూతిని పంచుతుంది. చాలా కాలం తరువాత థియేటర్లు ప్రేక్షకులతో కళ కళలాడుతున్నాయి. గత కొంతకాలంగా సినిమాలు లేక, సరైన కంటెంట్‌తో సినిమాలు రాక విసిగిపోయిన ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతితో పాటు మంచి సినిమా చూశామన్న ఆనందాన్ని ఇచ్చింది. అందుకే ప్రేక్షకులు ఈ చిత్రానికి అత్యంత భారీ విజయాన్ని అందించారు. ముఖ్యంగా చిత్రంలో వున్న హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌, విజువల్స్ చూసి, తెలుగు సినిమా స్థాయిని ప్రశంసిస్తున్నారు. దీంతో పాటు ఈ చిత్రానికి సమయం కూడా కలిసొచ్చింది.

ఈ మధ్య కాలంలో ఇంతటి భారీ స్థాయి సినిమా రాకపోవడంతో పాటు సినిమాకు లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీగా మారింది. సినిమాలో కీలకంగా వున్న బుజ్జి కారు, ఇలా సినిమాలో పాటు చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు అలరించే అంశాలు ఈ చిత్రంలో వుండటం కూడా మరో కారణం.రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ అన్ని అందరినీ ఆకట్టుకున్నాయి. మరి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ ఎపిక్ వండర్‌లో సాలిడ్ కాన్సెప్ట్‌తో పాటుగా ఆ కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా భారీ తారాగణం కూడా కనిపిస్తుంది. ఇండస్ట్రీలోని సెలెబ్రీటీస్‌లు సైతం ఈ మూవీపై రివ్యూలు ఇస్తుంటే ప్రేక్షకుల్లో ఈ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది.కల్కి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా పదకొండు రోజుల్లోనే 900 కోట్లు కలెక్షన్స్ సాధించి దూసుకుపోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>