BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tips7661366d-fba4-438f-b0b7-280fd013c071-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tips7661366d-fba4-438f-b0b7-280fd013c071-415x250-IndiaHerald.jpgవర్షాకాలంలో చర్మ సమస్యలని ఇలా తగ్గించుకోండి? వానా కాలం వచ్చిందంటే చాలు మనల్ని అనేక రకాల చర్మ సమస్యలు చుట్టుముడతాయి. దురద, ముఖంపై మొటిమల సమస్యలు మనల్ని దాడి చేస్తాయి.ఈ కాలంలో చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల సమస్యను మనం పూర్తిగా పరిష్కరించలేం. అయితే వర్షాకాలంలో చర్మ సంరక్షణ కోసం కొన్ని ఇంటి చిట్కాలు ఎల్లప్పుడూ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. పైగా వీటివల్ల ఎలాంటి దుష్ప్రభావాల భయం ఉండదు. మెరిసే చర్మాన్ని పొందడం కూడా చాలా సులభమవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఓటBeauty Tips{#}Turmeric;oil;Apple;thulasi;Tulasi;Manamవర్షాకాలంలో చర్మ సమస్యలని ఇలా తగ్గించుకోండి?వర్షాకాలంలో చర్మ సమస్యలని ఇలా తగ్గించుకోండి?Beauty Tips{#}Turmeric;oil;Apple;thulasi;Tulasi;ManamFri, 19 Jul 2024 21:01:00 GMT వానా కాలం వచ్చిందంటే చాలు మనల్ని అనేక రకాల చర్మ సమస్యలు చుట్టుముడతాయి. దురద, ముఖంపై మొటిమల సమస్యలు మనల్ని దాడి చేస్తాయి.ఈ కాలంలో చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల సమస్యను మనం పూర్తిగా పరిష్కరించలేం. అయితే వర్షాకాలంలో చర్మ సంరక్షణ కోసం కొన్ని ఇంటి చిట్కాలు ఎల్లప్పుడూ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. పైగా వీటివల్ల ఎలాంటి దుష్ప్రభావాల భయం ఉండదు. మెరిసే చర్మాన్ని పొందడం కూడా చాలా సులభమవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఓట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. రోజ్ వాటర్, పెరుగు ఇంకా తేనెతో ఓట్స్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మంపై దద్దుర్లు, మొటిమల సమస్యల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. ఇక వర్షా కాలంలో చర్మం జిడ్డుగా మారకుండా ఉండటానికి రోజ్ వాటర్‌ను ముల్తానీ మట్టితో కలిపి ముఖానికి మీరు రాసుకోవచ్చు. 


ముల్తానీ క్లే ఫేస్ ప్యాక్ ఆయిల్ స్కిన్ సమస్యలను చాలా ఈజీగా దూరం చేస్తుంది. ఇంకా అలాగే మొటిమలు, దద్దుర్లు సమస్యను తొలగించడానికి పసుపు చాలా బాగా పనిచేస్తుంది. పెరుగు, శెనగపిండితో పసుపుని కలిపి మన ముఖానికి రాసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వర్షాకాలంలో చాలా రకాల చర్మ సమస్యలను ఈజీగా దూరం చేస్తుంది. అలాగే మొటిమలు, ముడతలు, దద్దుర్లు వంటి వాటికి పరిష్కారం పొందడానికి తులసి ఆకులను కూడా మనం ఉపయోగించవచ్చు. తాజా తులసి ఆకుల పేస్ట్‌ను తీసుకొని దానిని రోజ్ వాటర్‌తో కలిపి, అందులో పెరుగును కలిపి ముఖానికి బాగా పట్టించాలి. తరువాత అది ఆరిన తర్వాత ముఖం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇంకా లాగే వర్షాకాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ని నీటిలో కలిపి ముఖంపై మీరు అప్లై చేసుకోవాలి. అలాగే దీనిని టోనర్‌గా కూడా మీరు ఉపయోగించవచ్చు.అయితే వీటిని వాడితే కొంతమందికి పడదు. కాబట్టి వీటిని ప్రయోగించే ముందు ఖచ్చితంగా ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>