EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/crimed8085d08-cfa7-473d-aa3a-339d3ff19ca5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/crimed8085d08-cfa7-473d-aa3a-339d3ff19ca5-415x250-IndiaHerald.jpgఏపీలో వరుసగా జరుగుతున్న అత్యంత దారుణ ఘటనలు సగటు వ్యక్తులను నివ్వెరపోయేలా చేస్తున్నాయి. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నాలుగు కూడా పసికందులపై కావడం గమనార్హం. వీటిలో ఒక ఘటన ఐదు రోజుల చిన్నారిపై జరగ్గా.. మరో రెండు ఘటనలు కూడా ఎనిమిదేళ్ల ముక్కుపచ్చలారని చిన్నారులపై చోటు చేసుకున్నాయి. ఆయా ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉలిక్కి పడేలా చేయడంతో పాటు మహిళలకే కాదు. బాలికలకు.. చిన్నారులకు రక్షణ కొరవడిందనే చర్చకు దారి తీశాయి. వారం క్రితం నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం మచ్చుcrime{#}Smart phone;you tube;Parents;Murder.;Father;Nandyala;Krishna River;mandalamచిన్నపిల్లలే కదా అనుకుంటే.. ఎన్ని ఘోరాలు చేస్తున్నారో?చిన్నపిల్లలే కదా అనుకుంటే.. ఎన్ని ఘోరాలు చేస్తున్నారో?crime{#}Smart phone;you tube;Parents;Murder.;Father;Nandyala;Krishna River;mandalamFri, 19 Jul 2024 13:00:00 GMTఏపీలో వరుసగా జరుగుతున్న అత్యంత దారుణ ఘటనలు సగటు వ్యక్తులను నివ్వెరపోయేలా చేస్తున్నాయి. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నాలుగు కూడా పసికందులపై కావడం గమనార్హం. వీటిలో ఒక ఘటన ఐదు రోజుల చిన్నారిపై జరగ్గా.. మరో రెండు ఘటనలు కూడా ఎనిమిదేళ్ల ముక్కుపచ్చలారని చిన్నారులపై చోటు చేసుకున్నాయి.


ఆయా ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉలిక్కి పడేలా చేయడంతో పాటు మహిళలకే కాదు. బాలికలకు.. చిన్నారులకు రక్షణ కొరవడిందనే చర్చకు దారి తీశాయి. వారం క్రితం నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం మచ్చు మర్రి పరిధిలోని ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అఘాయిత్యం రాష్ట్రం నివ్వెర పోయేలా చేసింది. బాలికను ఆడుకుందామని పిలిచిన ముగ్గురు బాలురు.. అత్యంత దారుణానికి ఒడిగట్టారు. అంతేకాదు ఆ బాలికపై అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేశారు.


అనంతరం దొరికిపోతామనే భయంతో విషయాన్ని కుటుంబీకులకు చెప్పారు. బాలిక మృత దేహాన్ని ఓ బాలుడి తండ్రి రాళ్లు కట్టి  కృష్ణా నదిలో పడేయడం మరింత కలకలం రేపింది. ప్రస్తుతం ఆ డెడ్ బాడీ దొరక్కపోవడం మరింత విస్మయానికి గురి చేస్తుంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. యూట్యూబ్ చూసిన ఆ బాలురు.. ఈ అఘాయిత్యానికి పాల్పడటం.


ఈ దురాఘాతానికి పాల్పడిన వారంతా తొమ్మది, పదో తరగతి చదువుతున్న వారే కావడం గమనార్హం. తమ పిల్లల దాష్టీకానికి ప్రాణాలు కోల్పోయిన ఆ చిన్నారి ఓ ఇంటి దీపమే అన్న విషయం మరిచిపోయి మైనర్లకు శిక్షలు తక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో పెద్దలు కూడా వారికి సహకరించడం ఎంత దారుణమో కదా. ప్రస్తుతం అంతర్జాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఉదయం నిద్ర లేచింది మొదలు.. విశ్రమించే వరకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అంతా సెల్ ఫోన్లకు బానిసలవుతున్నారు. ఇలా మైనర్లు సెల్ ఫోన్ లో అశ్లీల చిత్రాలు, వీడియోలు చూసి ఓ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడటం పలువురిని విస్మయానికి గురి చేసింది. సెల్ ఫోన్లు ఇచ్చే ముందు వారి తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఓ కంట కనిపెట్టాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>