MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/babi5c221c83-9d90-44b0-827a-6d693ad22e0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/babi5c221c83-9d90-44b0-827a-6d693ad22e0f-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బాబి ఒకరు. ఈయన పవర్ సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత అనేక మూవీలకు దర్శకత్వం వహించి ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈ దర్శకుడు ఆఖరుగా చిరంజీవి హీరో గా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా చిరంజీవి తో సినిమా అవకాశం ఎలా వచ్చింది అనే వివరాలనbabi{#}Remake;Darsakudu;Bobby;God Father;Smart phone;Cinema;Director;Chiranjeeviచిరు చేసిన ఆ రీమిక్ ఆఫర్ మొదట నాకే వచ్చింది.. బాబి..!చిరు చేసిన ఆ రీమిక్ ఆఫర్ మొదట నాకే వచ్చింది.. బాబి..!babi{#}Remake;Darsakudu;Bobby;God Father;Smart phone;Cinema;Director;ChiranjeeviFri, 19 Jul 2024 10:18:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బాబి ఒకరు. ఈయన పవర్ సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత అనేక మూవీలకు దర్శకత్వం వహించి ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈ దర్శకుడు ఆఖరుగా చిరంజీవి హీరో గా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అందులో భాగంగా చిరంజీవి తో సినిమా అవకాశం ఎలా వచ్చింది అనే వివరాలను పూర్తిగా చెప్పుకొచ్చాడు తాజాగా బాబీ మాట్లాడుతూ ... ఒక రోజు చిరంజీవి గారి నుండి ఫోన్ వచ్చింది. దానితో వెంటనే ఆయన దగ్గరకు వెళ్లాను. ఇక ఆయన మలయాళం లో గాడ్ ఫాదర్ అనే మూవీ వచ్చింది చూశావా ... దానిని నేను రీమేక్ చేయాలి అనుకుంటున్నాను. నువ్వు ఆ రీమేక్ మూవీకి దర్శకత్వం వహించగలవా అని అడిగాడు. ఇక దానితో నేను లేదు సార్. నేను రీమేక్ సినిమా చేయను సార్ ... నా కథతోనే సినిమా చేస్తాను అని అన్నాను.

దానితో ఆయన ఓకే నాకు ఒక కథ చెప్పు అని అన్నాడు. దానితో నేను 20 రోజులు టైమ్ ఇవ్వండి సార్ ఒక కథ రెడీ చేసి చెప్తాను అన్నాను. ఇక 20 రోజులు పూర్తి అయ్యింది చిరంజీవి గారి దగ్గరుండి ఫోన్ వచ్చింది. వెళ్లి వాల్టేరు వీరయ్య సినిమా కథ చెప్పాను. ఆయనకు సినిమా కథ బాగా నచ్చింది కానీ అక్కడక్కడ చిన్న చేంజెస్ చేయాలి చేసి మళ్లీ ఒక సారి వినిపించు అన్నాడు. నేను మళ్లీ మార్పులు , చేర్పులు చేసి కథ వినిపించాను ఆయనకు అద్భుతంగా నచ్చింది. అలా వాల్టేరు వీరయ్య సినిమా అవకాశం నాకు వచ్చింది అని బాబి తాజాగా చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>