MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/dil-rajuf3d82d80-5a2f-4c99-8a39-3646eba60116-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/dil-rajuf3d82d80-5a2f-4c99-8a39-3646eba60116-415x250-IndiaHerald.jpgగేమ్ చేంజర్: వణుకుతున్న దిల్ రాజు! నిజానికి శంకర్ ఫామ్ లో లేడనే చెప్పాలి. రోబో సినిమా తర్వాత ఆ స్థాయిలో సక్సస్ సాధించలేకపోతున్నారు. అయితే 'భారతీయుడు 2' సినిమాతో హిట్ కొట్టి దర్శకుడుగా మళ్ళీ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావించారు. ఎందుకంటే పొలిటికల్ సోషల్ డ్రామాస్ లో శంకర్ కు చాలా మంచి రికార్డ్ వుంది. రామ్ చరణ్ తో చేస్తున్న 'గేమ్‌ ఛేంజర్' కూడా అదే జోనర్ లో తెరకెక్కుతోంది. కాబట్టి కచ్ఛితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ రిజల్ట్ తేడా కొట్టింది. దీంతో ఫ్యాన్స్ కంDil Raju{#}dil raju;Genre;producer;Producer;GEUM;Dil;shankar;Ram Charan Teja;News;Bharateeyudu;Cinemaగేమ్ చేంజర్: వణుకుతున్న దిల్ రాజు!గేమ్ చేంజర్: వణుకుతున్న దిల్ రాజు!Dil Raju{#}dil raju;Genre;producer;Producer;GEUM;Dil;shankar;Ram Charan Teja;News;Bharateeyudu;CinemaFri, 19 Jul 2024 10:13:00 GMTనిజానికి శంకర్ ఫామ్ లో లేడనే చెప్పాలి. రోబో సినిమా తర్వాత ఆ స్థాయిలో సక్సస్ సాధించలేకపోతున్నారు. అయితే 'భారతీయుడు 2' సినిమాతో హిట్ కొట్టి దర్శకుడుగా మళ్ళీ ట్రాక్ లోకి వస్తారని  ఫ్యాన్స్ భావించారు. ఎందుకంటే పొలిటికల్ సోషల్ డ్రామాస్ లో శంకర్ కు చాలా మంచి రికార్డ్ వుంది. రామ్ చరణ్ తో చేస్తున్న 'గేమ్‌ ఛేంజర్' కూడా అదే జోనర్ లో తెరకెక్కుతోంది. కాబట్టి కచ్ఛితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ రిజల్ట్ తేడా కొట్టింది. దీంతో ఫ్యాన్స్ కంటే ఎక్కువ దిల్ రాజు భయపడుతున్నాడు.'ఇండియన్ 2' సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఒక్కసారిగా శంకర్ పై ఎన్నడూ లేనన్ని విమర్శలు వస్తున్నాయి.  ఇదంతా 'గేమ్‌ ఛేంజర్' బిజినెస్ పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందేమో అని అభిమానులు, దిల్ రాజు కలవరపడుతున్నారు. శంకర్ కారణంగా రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. 


సినిమా లేట్ అవ్వడతో దిల్ రాజుపై మరింత భారం పడిందనే సమాచారం తెలుస్తుంది. పైగా శంకర్ కారణంగా గేమ్ చేంజర్ కి భారీ బిజినెస్ కూడా జరగట్లేదు. భారతీయుడు 2 ఇచ్చిన షాక్ తో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని కొనడానికి వణుకుతున్నారు. భారతీయుడు 2 కి అయినా రిలీజ్ కి ముందు కొంత బజ్ ఉంది. అంచనాలు ఉన్నాయి. కానీ గేమ్ చేంజర్ కి అసలు బజ్ అనేది లేదు.ఇంకో పది రోజులు షూటింగ్ చేస్తే 'గేమ్‌ ఛేంజర్' సినిమా కంప్లీట్ అవుతుందని శంకర్ ఇటీవల మీడియాకి తెలిపడం జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ జరిగే విధానాన్ని బట్టి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తామని శంకర్ గతంలో చెప్పారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. అయితే శంకర్సినిమా ఎడిటింగ్ పనులను చెన్నైలో నిర్వహిస్తారని సమాచారం వినిపిస్తోంది. అయితే దీని వల్ల కంటెంట్ లో ఏమైనా చేంజెస్ చెప్పడానికి, నిర్మాత తన అభిప్రాయాన్ని పంచుకోడానికి అంతగా అవకాశం ఉండకపోవచ్చు. దీంతో దిల్ రాజుకి ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>