PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganb5668f71-351f-4abc-8a79-213f31571876-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaganb5668f71-351f-4abc-8a79-213f31571876-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితులను, క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని విపక్ష నేత జగన్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. రాజ్యాంగ వ్యవస్థలు కూప్పకూలిపోయాయని.. యంత్రాంగం నిస్తేజంగా మారిపోయిందని... ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని జగన్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో జగన్ ఏం రాశారంటే..” అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కార్యకర్తలు స్వైరవిహారం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణjagan{#}Chiranjeevi;Letter;Jagan;Party;central government;Prime Minister;TDPజగన్‌ గోడు.. మోడీ వింటారా.. ఛాన్స్‌ ఇస్తారా?జగన్‌ గోడు.. మోడీ వింటారా.. ఛాన్స్‌ ఇస్తారా?jagan{#}Chiranjeevi;Letter;Jagan;Party;central government;Prime Minister;TDPFri, 19 Jul 2024 09:04:00 GMTఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితులను, క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని విపక్ష నేత జగన్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. రాజ్యాంగ వ్యవస్థలు కూప్పకూలిపోయాయని.. యంత్రాంగం నిస్తేజంగా మారిపోయిందని... ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని జగన్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారు.


ఆ లేఖలో జగన్ ఏం రాశారంటే..” అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కార్యకర్తలు స్వైరవిహారం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. అత్యంత అనాగరిక సంఘటనలు జరుగుతున్నాయి. అమానవీయ, అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి, ఆ వెంటనే.. ఈ ఎన్నికల్లో తమను సమర్థించని, తమకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా మా పార్టీ.. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను వేధించడమే పనిగా పెట్టుకుంది. వారిని కొట్టడం, చంపడం, దారుణంగా వేధించి భయానక పరిస్థితులు సృష్టించడం వంటివన్నీ చేస్తున్నారు.


ఇళ్లు, భవనాలు కూల్చేస్తున్నారు. వ్యాపార సంస్థలపైనా దాడులు చేస్తున్నారు. పట్టపగలు యథేచ్ఛగా కొనసాగుతున్న ఈ ఘటనలు రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి నెలకొనేలా చేస్తున్నాయి. చివరకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులంటూ.. రోడ్డు పక్కనే చిరు వ్యాపారం చేసుకుంటున్న వారినీ వదలడం లేదు. వారిపై దాడులు చేసి, ఉపాధిని దెబ్బ కొడుతున్నారు.


మొత్తంగా చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయి. తక్షణం శాంతిస్థాపన జరగాల్సిన అవసరం ఉంది. సాధారణ పరిస్థితులు నెలకొనాల్సి ఉంది. అందుకే రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న ఘటనలన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరపాలని కోరుతున్నాను. ఈ విషయమై మిమ్మల్ని కలిసి, వ్యక్తిగతంగా నివేదించడం కోసం.. మీకు అనుకూల సమయంలో అపాయింట్‌మెంట్‌ ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నాను. వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్‌ ఇస్తే.. గత 40, 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులను వ్యక్తిగతంగా మీకు వివరిస్తాననిని జగన్‌ మోదీకి లేఖ రాశారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>